Iswarya Menon About Nikhil.. ఆ విషయంలో నిఖిల్ తనపై చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయిపోయానంటోంది అందాల భామ ఐశ్వర్యా మీనన్.నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా వస్తున్న ‘స్పై’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తన తొలి సినిమా హీరో అయిన నిఖిల్‌పై పొగడ్తల జల్లు కురిపిస్తోందీ అందాల ఐశ్వర్యం. అసలు విషయమేంటంటే, ‘మై హీరోయిన్.. మై హీరోయిన్..’ అంటూ నిఖిల్, ఐశ్వర్య మీనన్‌కి చాలా వెయిట్ ఇస్తున్నాడట.
Iswarya Menon About Nikhil.. నిఖిల్‌కి వీరాభిమానినైపోయా.!
తనకు తెలుగు సినిమా కొత్త అయినప్పటికీ, నిఖిల్ తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నాడనీ ఆ అభిమానానికి చూపిస్తున్న తాను ఫిదా అయిపోయానంటోంది ఐశ్వర్య మీనన్.
నిఖిల్ చాలా గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అంటూ తెగ పొగిడేస్తోంది. నిఖిల్ తనపై చూపిస్తున్న ఈ అభిమానం తానెప్పటికీ మర్చిపోనంటోంది.

అలాగే, నిఖిల్‌కి తాను వీరాభిమానిని అయిపోయానంటోంది. నిఖిల్‌ని చూస్తుంటే తనకెంతో గర్వంగా వుందని చెబుతోందీ అందాల భామ.
ఇప్పటికే నిఖిల్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ముందు ముందు మరిన్ని విజయాలందుకోవాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపింది తన అభిమాన హీరో నిఖిల్‌కి అందాల భామ ఐశ్వర్యా మీనన్.
వావ్.! అప్పుడే అంత టాలెంటా.?
ఐశ్వర్యా మీనన్ నటించిన తొలి తెలుగు చిత్రం ఇంకా రిలీజ్ కానప్పటికీ, సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ వేరే లెవల్‌లో వుంది.
ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ తనకంటూ ఓ గుర్తింపు దక్కించేసుకుందీ అందాల భామ. ఇక, ఫస్ట్ సినిమా సక్సెస్ అయ్యిందంటే టాలీవుడ్‌లో పాతుకుపోవడం పక్కా.
Also Read: Nabha Natesh Charlie Chaplin ఇస్మార్ట్ పాపా.. ఈ ‘కళ’ కూడానా?
హీరో నిఖిల్ తనపై చూపిస్తున్న అభిమానాన్ని ఇంత చక్కగా వ్యక్తపరిచి మరిన్ని మార్కులు కొట్టేసింది అప్పుడే ఐశ్వర్యా మీనన్.
అందంతో పాటూ, ఐశ్వర్యలో ఇలా మాటలతో ఎట్రాక్ట్ చేసే టాలెంట్ కూడా బాగానే వుంది. ఇంకేం తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం ఏమంత కష్టమైన పనేం కాదంటూ నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.