Reason Behind Akhanda2 Disaster.. హీరో నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా.?
అసలు ‘అఖండ-2’ సినిమాకి అయిన ఖర్చెంతో తెలుసా.? అన్నిటికీ మించి, ఎంత టేబుల్ ప్రాఫిట్టో తెలుసా.? ఇదీ, ‘అఖండ-2’ సినిమా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు వరకూ జరిగిన డిస్కషన్.!
‘వాళ్ళకి సినిమా బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు..’ అంటూ, ‘అఖండ-2’ నిర్మాతలు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో చేసిన వెటకారాల్నీ చూశాం.!
కట్ చేస్తే, ‘అఖండ-2’ సినిమా రిలీజ్, రాత్రికి రాత్రి ఆగిపోయింది. అభిమానులు గుడ్లు తెలేసేశారు.! నిర్మాతలేమో, క్షమాపణ చెప్పి చేతులు దులుపుకున్నారు.
Reason Behind Akhanda2 Disaster.. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటేనా.?
అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఈపాటికి థియేటర్లు దద్దరిల్లిపోయేవి.. సినిమా ఎలా వున్నా.! అభిమానులు, ఆ స్థాయిలో ‘అఖండ-2’ కోసం సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు.
‘నైజాం ఏరియాలోనే వంద కోట్లు కొల్లగొడతాం..’ అని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో థియేటర్ల దగ్గర నిన్న రాత్రి బాలయ్య అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఇంతకీ, టేబుల్ ప్రాఫిట్ వ్యవహారం ఏమైంది.? ‘అఖండ-2’ రిలీజ్ ఎందుకు ఆగిపోయింది.? బయ్యర్లు, డబ్బులు ఇవ్వలేదా.? ఎన్ని కోట్ల లోటు, సినిమా రిలీజ్‌ని ఆపేసింది.?
‘దాదాపు పాతిక కోట్లు..’ అంటున్నారు కొందరు. కాదు కాదు, యాభై కోట్ల పై మాటే.. అని మరికొందరంటున్నారు. 70 కోట్ల పైనే వుంది సమస్య.. అదే, సినిమాని ఆపేసిందన్నది ప్రముఖంగా వినిపిస్తున్నమాట.
డెబ్భయ్ కోట్లంటే.. పెద్ద కష్టమే..
చిన్న ఫిగర్ కాదు పాతిక కోట్లు అయినా, యాభై కోట్లు అయినా.! అలాంటిది, డెబ్భయ్ కోట్లంటే.. ఇంత పెద్ద ‘బొక్క’ పెట్టకుని, సినిమాని ఎలా ప్రమోట్ చేశారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
అప్పుడెప్పుడో పాత బాకీల వ్యవహారం.. అనే బుకాయింపులూ వింటున్నాం. అయితే, తెరవెనుక కష్టాలు అందరికీ తెలియవు. అలాగని, దాచేసే దాగే వ్యవహారమూ కాదు.
నిజానికి, హీరో నందమూరి బాలకృష్ణ ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే, ఈ సమస్య వచ్చేదే కాదన్నది చాలామంది అభిప్రాయం.! నిజమేనా.?
బాలయ్య, బోయపాటి.. ఇద్దరూ కలిసి దాదాపు వంద కోట్ల పైన రెమ్యునరేషన్ (చెరో యాభై) తీసుకున్నారన్న ప్రచారం దరిమిలా, ఆ ఇద్దరూ నిర్మాతని కష్ట కాలంలో కాపాడలేకపోయారా.?
