Vijay Deverakonda Rashmika Cringe.. ఇటు రష్మిక మండన్న అయినా, అటు విజయ్ దేవరకొండ అయినా.. చాలా ‘క్రింజ్’గా కనిపిస్తుంటారు చాలా సందర్భాల్లో.!
రష్మిక, విజయ్ మాత్రమేనా.. ఇంకెవరూ ఇలా ‘క్రింజ్’గా కనిపించడం మనం చూడలేదా.? ఫన్, హద్దులు దాటితే ‘క్రింజ్’ అనాలా.? అసలేంటీ, ఈ సినిమాటిక్ ‘క్రింజ్’ వ్యవహారం.?
మెగాస్టార్ చిరంజీవి అంటే, కామెడీ టైమింగ్‌కి పెట్టింది పేరు. అది కూడా ‘క్రింజ్’ అనే విమర్శల్ని ఇటీవలి కాలంలో ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.
కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం. ఈ క్రమంలోనే, ఈ ‘క్రింజ్’ అనే పదాన్ని చాలా తేలిగ్గా, అన్ని చోట్లా వాడేస్తున్నారు కొందరు.
‘రణబాలి’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో రష్మిక మండన్న – విజయ్ దేవరకొండ, తమ మధ్య రియల్ లైఫ్‌లో పుట్టిన ప్రేమ, అది వైవాహిక జీవితం వరకూ దారి తీసిన పరిస్థితుల గురించి చెబుతోంటే, అదీ క్రింజ్ అయిపోతోంది.
సినిమా ప్రమోషన్స్ అంటేనే, సినీ అభిమానుల అటెన్షన్‌ని తమవైపుకు తిప్పుకోవడం. ఈ క్రమంలో ‘క్రింజ్ థింగ్స్’ డిజైన్ చేయడం కూడా ఓ రకమైన పబ్లిసిటీ స్టంటే.
వర్కవుట్ అయితే, ‘క్యూట్’.. వర్కవుట్ కాకపోతే, ‘క్రింజ్’.. అంతే తేడా.! విజయ్ దేవరకొండ కావొచ్చు, రష్మిక మండన్న కావొచ్చు.. తరచూ ట్రోల్ అవుతుంటారు తమ చర్యల కారణంగా.
అసలు వీళ్ళేమీ చెయ్యకపోయినా, వీరిని ట్రోల్ చేసేవాళ్ళుంటారు.. అది వేరే సంగతి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండకి ‘యాంటీ ఫ్యాన్స్’ ఎక్కువ.
వేరే హీరోల సినిమాలు వస్తే, విజయ్ దేవరకొండ అభిమానులు చేసే ట్రోలింగ్, యాగీ.. అంతా ఇంతా కాదు. అందుకే, విజయ్ దేవరకొండ కూడా ఎక్కువగా ట్రోల్ అవుతుంటాడు.
అద్గదీ అసలు సంగతి.! ‘రణబాలి’ సినిమా ప్రమోషనల్ వీడియోలు, ఇంటర్వ్యూలు.. ‘క్రింజ్’ అయిపోవడానికి కారణం ఇదే.
అయితేనేం, సినిమా జనాల్లోకి వెళుతోంది. సోషల్ మీడియా అంతా విజయ్, రష్మిక మాత్రమే కనిపిస్తున్నారు గత కొన్ని రోజులుగా.
ఏదిఏమైనా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రణబాలి’ సినిమా, ఈ ‘క్రింజ్’ పబ్లిసిటీ స్టంట్స్ కారణంగా, నవ్వులపాలైపోకూడదు.!