Home » ఉండవల్లి సిద్ధాంతం: తక్కువ.. అంటే, ఏమీ లేనట్టే.!

ఉండవల్లి సిద్ధాంతం: తక్కువ.. అంటే, ఏమీ లేనట్టే.!

by hellomudra
0 comments
Vundavalli Arun Kumar

Laddu Adulteration Vundavalli Arun Kumar.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుసు కదా.? రాజమండ్రి ఎంపీగా పని చేశారు ఉండవల్లి.. కాంగ్రెస్ హయాంలో.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి మాటకారి.! ‘విషయ పరిజ్ఞానాన్ని’ చాటుకోవడంలో, ఉండవల్లి అరుణ్ కుమార్, తనదైన మాటకారితనాన్ని భలే ప్రయోగిస్తుంటారు.

తాజాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదం అయిన లడ్డూ వైసీపీ హయాంలో కల్తీ అయ్యిందంటూ, సంబంధిత వ్యవహారంపై విచారణ జరుగుతున్న వేళ, ఉండవల్లి తనదైన మాటకారితనాన్ని ప్రదర్శించారు.

రిపోర్టుల్లో, జంతువుల కొవ్వు సహా ఫిష్ ఆయిల్ వంటి వటి శాతం చాలా తక్కువ అని పేర్కొన్నారనీ, చాలా తక్కువ అంటే, అసలు లేవనే అర్థమనీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

దాంతో, సోషల్ మీడియా వేదికగా ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఇంట్రెస్టింగ్ రీతిలో ట్రోలింగ్ జరుగుతోంది.!

Laddu Adulteration Vundavalli Arun Kumar.. బీపీ తక్కువుంటే.. బీపీ లేనట్లా.?

‘మీకు బీపీ తక్కువగా వుంది.. అంటే, బీపీ లేనట్లే..’ అని సెటైర్లేస్తున్నారు నెటిజన్. తక్కువ, చాలా తక్కువ.. వంటి ప్రస్తావనలకు అర్థం తెలియనంత అమాయకుడైతే కాదు ఉండవల్లి అరుణ్ కుమార్.

కాకపోతే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చే క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లెక్క తప్పారు.. తప్పులో కాలేశారు.

10 శాతం కంటే తక్కువ మొత్తంలో సంబంధిత కొవ్వు జాడలు వుంటే, వాటి జాడని కనుక్కోవడం వీలు కాదంటూ, లడ్డూకి వినియోగించిన నెయ్యి విషయమై నిర్వహించిన ఓ పరీక్ష ఫలితాలపై సిట్ స్పష్టతనిచ్చింది.

పది శాతం కంటే తక్కువ.. అంటే, ‘లేదు’ అని ఉండవల్లి ఎలా తేల్చి వుంటారు.? లడ్డూ ప్రసాదం కల్తీ విషయమై, సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చింది.

అసలంటూ నెయ్యిని వినియోగించకుండా, కెమికల్స్ అలానే పామాయిల్ వినియోగించి నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేశారని ‘సిట్’ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంత స్పష్టంగా కల్తీపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం, న్యాయస్థానంలో చార్జి షీటు దాఖలు చేస్తే, కల్తీ వ్యవహారంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉండవల్లి అరుణ్ కుమార్ వెనకేసుకురావడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group