Home » పవన్ కళ్యాణ్ సినిమాలు వైసీపీని ఎందుకు భయపెడుతున్నాయ్.?

పవన్ కళ్యాణ్ సినిమాలు వైసీపీని ఎందుకు భయపెడుతున్నాయ్.?

by hellomudra
0 comments
Pawan Kalyan Ys Jagan

Pawan Kalyan Cinema Jagan.. రాజకీయాల్లో ఆయన జన సేన పార్టీ అధినేత అయి వుండొచ్చు, సినిమాల్లో మాత్రం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

సక్సెస్, ఫెయిల్యూర్.. వీటికి అతీతంగా పవన్ కళ్యాణ్ సినిమా గ్రాఫ్.. పెరుగుతూనే వుంటుంది. పవన్ కళ్యాణ్ అందుకునే రెమ్యునరేషన్.. ఎప్పుడూ వేరే లెవల్ వుంటుందంతే.

‘నేను సినిమా కోసం రోజులో నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే సమయం కేటాయించగలను..’ అని పవన్ కళ్యాణ్ కండిషన్లు పెడుతున్నారు.

కానీ, నిర్మాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసేందుకు క్యూ కడతారు.

ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ వుంటారో తెలియని పరిస్థితి.. అయినా, ఆయనతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు పోటీ పడుతుంటారు.

Pawan Kalyan Cinema Jagan.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న..

ఇదే, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంశం. మరీ ముఖ్యంగా వైసీపీకి, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం అస్సలు నచ్చడం లేదు.

సినిమానే పవన్ కళ్యాణ్‌కి ప్రధాన ఆదాయ వనరు. ఆ సినిమాల నుంచి వచ్చే సంపాదనే, జన సేన పార్టీకి ఇంధనం.. అని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, చెబుతూనే వున్నారు.

అందుకే, పవన్ కళ్యాణ్ సినిమాలంటే వైసీపీకి అస్సలు నచ్చదు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలపై అప్పటి జగన్ ప్రభుత్వం చేసిన దాడిని చూశాం.

మంత్రులుగా పని చేసినవారు అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఆపడానికి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం.

అధికారం కోల్పోయాక, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా తనకు అత్యంత సన్నిహితుల్ని ఉపయోగిస్తున్నారు వైఎస్ జగన్.

భయం.. టన్నుల్లో..

ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదంటూ ఓ మాజీ ఐఏఎస్ అధికారి కోర్టును ఆశ్రయించారు. ఆ మాజీ ఐఏఎస్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

న్యాయస్థానం, సదరు మాజీ ఏఐఎస్ అధికారికి చీవాట్లు పెట్టిందనుకోండి.. అది వేరే సంగతి. అసలు, ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఎందుకు నటించకూడదు.? నటించడం తప్పెలా అవుుంది.?

ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వ్యక్ి, అసలంటూ ఐఏఎస్ అదికారి ఎలా అయ్యారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇక్కడ విషయం సుస్పష్టం. పవన్ కళ్యాణ్ అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయం. పవన్ కళ్యాణ్ సినిమాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంకా భయం.!

ఆ భయం.. టన్నుల్లో వుంది.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group