Home » ‘ఆంటీ’ అంటే, లక్షన్నర జరీమానా.! జర జాగ్రత్త మరి.!

‘ఆంటీ’ అంటే, లక్షన్నర జరీమానా.! జర జాగ్రత్త మరి.!

by hellomudra
0 comments
Anasuya Bharadwaj

Aunty Trolling Anasuya Compensation.. ఆంటీ.. అని పిలిస్తే నేరమా.? ఔను, నేరమే.! పిలిస్తే నేరం కాదు, ఆ పేరుతో వేధిస్తే, నేరమే.! దానికి జరీమానా లక్షన్నర.!

కాకపోతే, ఇది ఇండియాలో కాదు, బ్రిటన్‌లో.! బ్రిటన్‌లో ఓ ఉద్యోగిని తోటి ఉద్యోగినిపై ‘ఆంటీ’ అంటూ పదే పదే వెటకారం చేయడంతో, బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దాంతో, నిందితురాలికి న్యాయస్థానం జరీమానా విధించింది. బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారం మొత్తం సొమ్ము 1425 పౌండ్లు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు లక్షన్నర.

విశేషమేంటంటే, ఈ ఘటనలో బాధితురాలు భారత సంతతి మహిళ కావడం. బాధిత మహిళ పేరు ఐడా.

Aunty Trolling Anasuya Compensation.. అనసూయ బాధితురాలు..

కాగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది నటి అనసూయ. అనసూయ భరద్వాజ్ గురించి తెలుసు కదా.? ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మత్త’ పాత్రతో పాపులర్ అయ్యింది అనసూయ.

సోషల్ మీడియా వేదికగా అనసూయని ట్రోల్ చేయడానికి, ఎక్కువగా ‘ఆంటీ’ అనే ప్రస్తావననే ఉపయోగిస్తుంటారు నెటిజనం.

అలా తనను ‘ఆంటీ’ అంటూ వేధిస్తున్నవారిపై పలు సందర్భాల్లో పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేశారు కూడా. వల్గర్ కామెంట్స్‌తో అనసూయని వేధించిన కొందరు నెటిజన్స్ పోలీసులకు చిక్కడం తెలిసిన విషయమే.

అయినాగానీ, అనసూయ మీద సోషల్ మీడియా వేదికగా ‘ఆంటీ’ అంటూ వేధించేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.!

నియంత్రణ తప్పనిసరి..

ఈ జరీమానాల వ్యవహారం భారత దేశంలోనూ అమలైతే, అనసూయకి చెల్లించాల్సిన మొత్తం కోట్లల్లోనే వుంటుందేమో నిందితులు.!

Also Read: నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!

సోషల్ మీడియాపై నియంత్రణ దిశగా ఇప్పుడిప్పుడే కఠిన చర్యలు షురూ అవుతున్నాయి. అడల్ట్ కంటెంట్ మీద ఇటీవల పూర్తి బ్యాన్ విధించింది కేంద్రం సోషల్ మీడియాకి సంబంధించి.

ట్రోలింగ్ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే, సోషల్ వేధింపులు తగ్గుముఖం పడతాయి.! సోషల్ మీడియాని ఎవరైనా సరే, బాధ్యతగా వాడాలి. అదే అందరికీ మంచిది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group