Table of Contents
USA Donald Trump Iran.. గొడవేమో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన.! ‘పెద్దన్న’ పాత్ర పోషించిందేమో, అమెరికా.! దారుణంగా దెబ్బ తింటున్నది మాత్రం యూఏఈ తదితర గల్ఫ్ దేశాలు.!
రోజులు గడిచిపోతున్నాయ్.. వారాలు గడిచిపోతున్నాయ్.. నెలలు కూడా గడిచిపోతున్నాయ్.. కానీ, ఇరాన్ లొంగడంలేదు.!
ప్రపంచానికే పెద్ద పోలీస్ అయిన అమెరికా రంగంలోకి దిగినా, ఇరాన్ లొంగడం లేదంటే, అర్థమేంటి.? చాలా దేశాలు నష్టపోతున్నాయ్.. ఆర్థికంగా చితికపోతున్నాయ్.
ఇప్పటికే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. యుద్ధ విమానాలూ నేల కూలుతున్నాయ్.. కుప్పలు తెప్పలుగా క్షిపణలూ పేలుతున్నాయ్.
కానీ, యుద్ధం ఓ కొలిక్కి రావడం లేదు. ప్రపంచంలో ఏ దేశం మీద అయినా తనదే పెత్తనం.. అన్నట్లు వ్యవహరిస్తుంటుంది అమెరికా. ఇది బహిరంగ రహస్యం.
తొలిసారి.. అమెరికా ఈ స్థాయిలో నష్టపోవడం..
అయితే, ఏ దేశంతో యుద్ధం జరిగినప్పుడూ, అమెరికా ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోలేదు. ఈ స్థాయిలో అమెరికాకి యుద్ధ నష్టం సంభవించిన దాఖలాలు లేవు.
అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలు సైతం నేల కూలుతున్నాయ్ ఇరాన్ దెబ్బకి. అమెరికా ఎక్కడెక్కడైతే తమ స్థావరాల్ని నెలకొల్పిందో, వాటిని ధ్వంసం చేసుకుంటూ వెళుతోంది ఇరాన్.
అసలు ఇరాన్ ఎలాంటి ఆయుధాల్ని ప్రయోగిస్తోంది.? వాటిని ఎదుర్కోవడం ఎలా.? అన్న ప్రశ్నలకే అమెరికా సమాధానం కనుగొనలేకపోతోంది.
నేరుగా అమెరికా మీద ఇరాన్ దాడి చేయడం లేదు. కానీ, ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తూనే వుంది. ఇజ్రాయెల్ ఓ పక్క, అమెరికా ఇంకోపక్క.. ఇరాన్ మీద దాడి చేస్తున్నా, ఇరాన్ బలంగా నిలబడింది.
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్..
సరే, ప్రపంచానికి పెద్ద మొత్తంలో క్రూడాయిల్ సరఫరా చేసే సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసివేస్తుండడంతో, ప్రపంచమంతా విలవిల్లాడుతోంది.. అది వేరే విషయం.
తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ చేస్తున్న పోరాటం ప్రత్యేకం. ఇరాన్ అంతర్గత విషయాలు.. అది వేరే చర్చ.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. నిజానికి, ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్యనున్న గొడవల నేపథ్యంలో, యుద్ధం శాశ్వతంగా ముగుస్తుందని ఎవరూ నమ్మలేరు.
అయితే, ఈ యుద్ధంలో అమెరికా ఎప్పటిదాకా పోరాడగలుగుతుంది.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. అమెరికాపై ఈ యుద్ధం కారణంగా పడుతున్న ఆర్థిక భారంపై అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ట్రంప్ దెబ్బ.. అమెరికా విలవిల..
ఏ క్షణాన అయినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే గనుక జరిగితే, డోనాల్డ్ ట్రంప్ పెద్దగా నష్టపోయేదేమీ లేదు.
కానీ, అమెరికాని మాత్రం డోనాల్డ్ ట్రంప్ పాతాళానికి తొక్కేసినట్లే అవుతుంది. ప్రపంచానికే పెద్ద పోలీస్.. అన్న ట్యాగ్ అమెరికాకి దూరమవుతుంది.
ఏమో, ట్రంప్ తీరు చూస్తోంటే, అమెరికానే ప్రపంచ దేశాల్ని ‘దేహీ’ అని అడుక్కోవాల్సి వచ్చేలా చేసేదాకా నిద్రపోయేలా లేడు.!
యుద్ధంలో అమెరికా అలసిపోతోంది.. యుద్ధ విరామం ప్రకటిస్తోంది.. కానీ, ఇరాన్ అస్సలు తగ్గడంలేదు. దీనర్థమేంటి.? ఇరాన్ చేతిలో అమెరికా ఓటమి పాలయినట్లేనా.?
