Home » పాయల్ రాధాకృష్ణ సూటి ప్రశ్న.! తెలుగంటే, చులకనెందుకు.?

పాయల్ రాధాకృష్ణ సూటి ప్రశ్న.! తెలుగంటే, చులకనెందుకు.?

by hellomudra
0 comments
Payal Radhakrishna

Payal Radhakrishna Telugu Love.. సినీ నటి పాయల్ రాధాకృష్ణది కర్నాటక.! కొంకణి ఆమె మాతృ భాష. కన్నడ, రాష్ట్ర భాష.!

రాష్ట్ర భాషే మాతృ భాష అవ్వాలి కదా.? అంటే, కర్నాటకలో ఒకింత భిన్నమైన పరిస్థితులుంటాయ్ మాతృ భాష విషయమై. అది మళ్ళీ వేరే చర్చ.

పాయల్ రాధాకృష్ణ, తెలుగులో బాగా మాట్లాడుతుంటుంది. మాతృభాష కొంకణి అయినా, కన్నడలో బాగా మాట్లాడుతుంది, రాయగలుగుతుంది కూడా.

Payal Radhakrishna
Payal Radhakrishna

ఆసక్తికరమైన విషయమేంటంటే, తెలుగు హీరోయిన్లే తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడరుగానీ, పాయల్ రాధాకృష్ణ తెలుగులో చక్కగా మాట్లాడుతుంది.

మాట్లాడటమేంటి.? పాటలు కూడా పాడుతుందిట. తెలుగు సాహిత్యం అంటే, చాలా చాలా ఇష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది పాయల్ రాధాకృష్ణ.

Payal Radhakrishna Telugu Love.. తెలుగు సాహిత్యమంటే మక్కువ ఎక్కువ..

తెలుగు సాహిత్యంలో కొన్ని కఠిన పదాలకు అర్థాలు తనకు తెలియవనీ, వాటిని తెలుసుకునేందుకు, తెలుగునాట ఎవర్నయినా అడిగితే, వారి నుంచి తనకు సరైన సమాధానం దొరకడంలేదని చెప్పింది పాయల్.

‘ఎందుకు తెలుగబ్బాయిలు, తెలుగమ్మాయిలు.. తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోరు.? తప్పు కదా.? మాతృభాషపై మమకారం వుండాలి కదా..’ అంటూ పాయల్ రాధాకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం.

Also Read: ‘ఆంటీ’ అంటే, లక్షన్నర జరీమానా.! జర జాగ్రత్త మరి.!

ఈ విషయంలో పాయల్ రాధాకృష్ణని అభినందించి తీరాలి. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే. పెద్దగా హిట్లు కూడా లేవు.

కానీ, తెలుగులో గలగలా మాట్లాడుతుంటుంది.. తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకుంటోంది. చాలా అరుదుగా వుంటారు ఇలాంటోళ్ళు.

Payal Radhakrishna
Payal Radhakrishna

నిత్యా మీనన్, మమతా మోహన్ దాస్, రాశి ఖన్నా.. వీళ్ళెవరూ తెలుగువారు కాకపోయినా, తెలుగులో మాట్లాడతారు, తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటారు.. తెలుగులో పాటలు కూడా పాడేస్తారు.

ఔను, తెలుగు భాష తియ్యదనం అందరికీ అర్థమవుతుంది.. తెలుగు హీరోయిన్లకి తప్ప.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group