Ritika Nayak Glamorous Attack.. జపాన్ బొమ్మలా కనిపిస్తుందిగానీ, తెలుగు సినిమాల్లో సత్తా చాటుతోంది రితిక నాయక్.!
తెలుగులో ‘మిరాయ్’ సినిమాతో మొన్నీమధ్యనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న రితిక, తెలుగు సినీ ప్రయాణం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మొదలైంది.
ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. వరుణ్ తేజ్ ఈ ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
యాక్షన్ సినిమాలంటే ఇష్టమట..
రితిక నాయక్‌కి యాక్షన్ సినిమాలంటే ఇష్టమట. గ్లామరస్ పాత్రలు చేయడంలో తనకేమీ ఇబ్బంది లేదని ఈ బ్యూటీ అంటోంది.
‘మిరాయ్’ సినిమాలో గ్లామర్‌కి అస్సలేమాత్రం స్కోప్ లేని పాత్రలో నటించింది రితిక. కానీ, సినిమాకి సంబంధించిన ఓ ప్రమోషనల్ సాంగ్‌లో ఓ మోస్తరు గ్లామర్‌ని రితిక ఒలకబోసింది.

యాక్షన్ సినిమాల్లో ఛాన్సులు వస్తే అస్సలు వదులుకోనంటోన్న రితిక, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూనే, గ్లామరస్ సినిమాలూ చేస్తానని చెప్పుకొచ్చింది.
Ritika Nayak Glamorous Attack.. హీట్ పెంచేసింది..
తాజాగా, సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది రితిక. చూస్తున్నారు కదా.. ఏ స్థాయిలో గ్లామర్ ఒలక బోసేస్తోందో.!
అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో కవి.! నిజమే, అందాన్ని చూడాలి.. ఆనందించాలి.! ట్రోలింగ్ అంటారా.. అది మామూలేననుకోండి.. అది వేరే సంగతి.
Also Read: లెహెంగా ఖరీదు లచ్చ.! చీప్ అండ్ బెస్టేగా.!?
మొత్తమ్మీద, ఈ సొట్టబుగ్గల జపాన్ బొమ్మ.. తెలుగు తెరపై ముందు ముందు గ్లామరస్ పాత్రలతో చెలరేగిపోనుందన్నమాట.!
