Ashu Reddy Cheating Case.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఫేమ్ అషు రెడ్డి పేరు వార్తల్లోకెక్కింది. ఏకంగా తొమ్మిదిన్నర కోట్లు కొల్లగొట్టిందంటూ ఓ వ్యక్తి, అషు రెడ్డికి వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు ఎన్నారై. తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి, అషు రెడ్డి తనను మోసం చేసిందన్నది బాధితుడి వెర్షన్. ఈ మేరకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది కూడా.
తొమ్మిదిన్నర కోట్ల నగదుని, సదరు వ్యక్తి ఎందుకు అషు రెడ్డికి ఇచ్చాడన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇద్దరూ ప్రేమించుకున్నారట.. ఈ క్రమంలో, తన అవసరాల కోసం అషు రెడ్డి డబ్బులు అడిగితే, సదరు వ్యక్తి ఇచ్చాడట.
మొహమాటానికి ఐదు లక్షలో, పది లక్షలో.. పాతిక లక్షలో ఇస్తే ఓకే.. కానీ, తొమ్మిదిన్నర కోట్లు ఇవ్వడమేంటి.?
Ashu Reddy Cheating Case.. డబ్బుతోపాటు బంగారం కూడానట..
డబ్బు మాత్రమే కాదు, దాదాపు ఐదు కిలోల బంగారం కూడా ఇచ్చాడట. ఇది ఇంకో ట్విస్టు. మొత్తంగా చూస్తే, అషు రెడ్డి గట్టిగానే లాగేసిందన్నమాట.. సదరు వ్యక్తి నుంచి.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అషు రెడ్డి, సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఆధారాల్లేని ఆరోపణలు, అసత్య కథనాలు ప్రచారం చేస్తే, చట్ట పరమైన చర్యలుంటాయన్నది అషు రెడ్డి, సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరిక సారాంశం.
Also Read: దెయ్యాల పండగ ‘Halloween’లో మన ‘కొరివి దెయ్యాలు’.!
కేసు నమోదయ్యాక, విషయం పబ్లిక్ అయిపోయింది. ఎవరూ మాట్లాడుకోకుండా ఎందుకుంటారు.? ఎవరికి తోచిన కథలు వాళ్ళు అల్లుకోకుండా ఎందుకుంటారు.?
మొన్నీమధ్యనే గాయని మంగ్లిపై ఓ వ్యక్తి, ఇలానే చీటింగ్ ఆరోపణలు చేస్తూ, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకేమీ తెలియదంటూ మంగ్లీ ఎదురుదాడికి దిగింది.
గ్లామర్ ప్రపంచంలోని వ్యక్తులపై ఈ తరహా ఆరోపణలు కొత్తేమీ కాదు. కొన్ని కేసులు ఏళ్ళ తరబడి నడుస్తూనే వుంటాయి.
Also Read: దెయ్యాల పండగ ‘Halloween’లో మన ‘కొరివి దెయ్యాలు’.!
ఇంతకీ, అషు రెడ్డి మీద కేసు వ్యవహారం ఏమవుతుంది.? పెళ్ళి దిశగా, ఇరు కుటుంబాల మధ్య కొన్ని ‘ఫార్మాలిటీస్’ కూడా పూర్తయ్యాయంటూ, బాధిత కుటుంబం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంత జరిగాక, ‘ఎవరన్నా మాట్లాడితే చట్టపరమైన చర్యలు’ అంటూ అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగడమే హాస్యాస్పదంగా మారింది.
ఇక, అషు రెడ్డి తప్పు చేసిందా.? లేదా.? అన్నది పోలీస్ విచారణలో తేలనుంది. ఇప్పటికిప్పుడు.. ఆమెను దోషిగా, మీడియా చిత్రీకరించే ప్రయత్నమూ సబబు కాదు.
