Home » విలువలూ.. విశ్వసనీయత.! నీలి కూలి మీడియా.. ఓ కోడి కత్తీ.!

విలువలూ.. విశ్వసనీయత.! నీలి కూలి మీడియా.. ఓ కోడి కత్తీ.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Blue Media Against Pawan Kalyan.. జూన్ 2వ తేదీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

అదే రోజున, తెలంగాణలో జన సేన పార్టీ, తమ పార్టీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలతో ఓ ఇండోర్ మీటింగ్ ప్లాన్ చేసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం, ఆ మీటింగుకి అనుమతి నిరాకరించింది, పార్కింగ్ సౌకర్యం లేదన్న ‘కుంటి సాకు’తో.! సరే, అంతకు ముందు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అతి, తదనంతర పరిణామాలు తెలిసిన విషయాలే.

వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుగా మారిన ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీకి వైఎస్ జగన్ లాంగ్ టెర్మ్ ఫ్రెండ్ అని తేల్చి, జగన్ అరెస్టు కోసం అమిత్ షా వద్దకు వెళ్ళిన పవన్ కళ్యాణ్‌కి భంగపాటు.. అంటూ ఓ కట్టు కథ అల్లారు.

విషయం సుస్పష్టం. ప్రొఫెసర్ నాగేశ్వర్, డబ్బుకి కక్కుర్తి పడి, ఆ గాలి పోగేశారు. తప్పు ఆయనా తెలుసుకుని, క్షమాపణ చెప్పారు, పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు కూడా.

అక్కడితో వివాదం ముగిసిపోవాల్సి వున్నా, ఆ తర్వాత నాగేశ్వర్, కొంత మందిని వెంటేసుకుని, ప్రెస్ క్లబ్‌లో మళ్ళీ రచ్చ చేశారు. దాంతో, విషయం ముదిరి పాకాన పడింది.

Blue Media Against Pawan Kalyan.. పవన్ కళ్యాణ్‌కేంటి సంబంధం.?

ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తప్పేముంది.? కానీ, పవన్ కళ్యాణ్ చుట్టూనే తెలంగాణలో రచ్చ జరుగుతోంది. ఆ రచ్చ అంతలా పెరగడానికి కారణం వైసీపీ కూలి మీడియా.

నీలి కూలి మీడియా ఓ వైపు, నీలి కూలీలు ఇంకో వైపు.. వెరసి, నానా యాగీ జరిగింది, జరుగుతోంది.

వైసీపీకి అత్యంత సన్నిహితమైన బీఆర్ఎస్ సహా, కాంగ్రెస్ పార్టీలోని ఒకప్పటి వైఎస్సార్ సానుభూతిపరులూ, పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగేస్తున్నారు.

లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి, తీహార్ జైలుకి వెళ్ళి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా, ఈ కుట్రలో భాగస్వామిగా కనిపిస్తున్నారనుకోండి.. అది వేరే చర్చ.

పవన్ కళ్యాణ్‌ తప్పు ఇందులో ఏముందసలు.? కానీ, విలువలు కాకరకాయలు.. అంటూ, వైసీపీ కూలి మీడియా ఓ పెద్ద కథనాన్ని వండి వడ్డించింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ ఏదో అన్నారట, అది తప్పట.. అలాగని కూలి మీడియా అంటోంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో, చిరంజీవిని రాజకీయంగా ఇబ్బంది పెట్టారు వైఎస్సార్.

అప్పట్లో చిరంజీవికి వ్యతిరేకంగా వైఎస్సార్ కుట్ర..

ఎంత ఇబ్బంది అంటే, పార్టీ పెడతారేమో.. అన్న భయంతో చిరంజీవిని దెబ్బ తీయడానికి, చిరంజీవి ఇంట్లో కుంపటి రాజేసింది స్వయంగా వైఎస్సార్.

ఈ కుట్రలో భాగమైన ఓ కాంగ్రెస్ నేత, అప్పట్లో హఠాన్మరణం చెందారు. ఆయన కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఇక, వైఎస్సార్ సంగతి సరే సరి. పావురాల గుట్టలో.. అది అందరికీ తెలిసిందే కదా.

జీవిత, రాజశేఖర్‌లను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ అప్పట్లో ఆడించిన నాటకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘కాంగ్రెస్ పంచెలూడదీసి..’ అంటూ, అప్పట్లోనే వైఎస్సార్‌కి అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్.

కన్వీనియెంట్‌గా వైసీపీ కూలి మీడియా ఈ మొత్తం వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇక, కేవీపీ రామచంద్రరావు, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా లేఖ రాయడం.

కేవీపీ లేఖ.. ఎంత ఖరీదైనది.?

అసలు కేవీపీ ఎవరు.? సూట్‌కేస్.. అనే పేరు ఆయనకెలా వచ్చిందో.. కాంగ్రెస్ పార్టీలో ఎవర్నడిగినా చెప్తారు. సో, కేవీపీ రాసిన లేఖాస్త్రం, దాని రేటు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

చివరగా: కోడి కత్తితో రాజకీయాలు చేసినవాళ్ళు.. గుండె పోటుని గొడ్డలి పోటుగా ఏమార్చే ప్రయత్నం చేసినవాళ్ళు.. జన సేనాని పవన్ కళ్యాణ్ మీద రాజకీయ కుట్రలు చేయడం హాస్యాస్పదం.

విలువలు, విశ్వసనీయత.. అంటే, కోడి కత్తి – గొడ్డలి వేటు.. అని వైసీపీ డిక్షనరీలో రాసుకున్నట్లుంది నీలి కూలి మీడియా ఏడుపు చూస్తోంటే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group