Home » ‘పెద్ది’లో జాన్వీ కపూర్ వల్గారిటీపై.. ‘మాటలు – మంటలు’.!

‘పెద్ది’లో జాన్వీ కపూర్ వల్గారిటీపై.. ‘మాటలు – మంటలు’.!

by hellomudra
0 comments
Janhvi Kapoor

Janhvi Kapoor Vulgarity Peddi.. అసలు, ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ ఎందుకు.? కేవలం గ్లామర్ పేరుతో వల్గారిటీ తప్ప, ‘అచ్చియమ్మ’ పాత్రకి కథతో అవసరమేముంది.?

ఇదీ, ‘పెద్ది’ సినిమా రిలీజ్ తర్వాత, జాన్వీ కపూర్ మీద జరుగుతున్న చర్చ.. నిజానికి, చర్చ కాదిది రచ్చ.! తెలుగు సినిమాల్లో హీరోయిన్ గ్లామరస్‌గా కనిపించడం ఇదే కొత్త కాదు.!

అసలు గ్లామర్ అంటే ఏంటి.? వల్గారిటీ అంటే ఏంటి.? అంటే, ఆ కథ చాలా పెద్దది. తెరపై బికినీల్లో హీరోయిన్లు ఎన్నో దశాబ్దాలుగా కనిపిస్తూనే వున్నారు.

లిప్ లాక్ సీన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలో హద్దులు దాటేసి, బూతు సినిమాలనే ట్యాగ్ వేయించుకున్న కళాఖండాలు కోకొల్లలు.

Janhvi Kapoor Vulgarity Peddi.. అప్పటి వ్యాంపులతో పోటీ పడుతున్న ఇప్పటి హీరోయిన్లు..

ఒకప్పుడు వ్యాప్ పాత్రలుండేవి.. హీరోయిన్లే చాలాకాలంగా ఆ వ్యాంప్ పాత్రలు లేని లోటుని భర్తీ చేసేస్తున్నారు. ఐటమ్ బాంబ్స్.. అని ఒకప్పుడు వుండేవారు.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా హీరోయిన్లే చేసేస్తున్నారు.

సో, ఇక్కడ జాన్వీ కపూర్ తప్పేమీ లేదు. పోనీ, దర్శకుడిదే తప్పంతా.. అనొచ్చా.? అంటే, అదీ కరెక్ట్ కాదు.

ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ అందించాలన్న విషయమై కలసికట్టుగా తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఇదంతా.

పాత్ర, దాని తాలూకు ప్రవర్తన.. ఇదంతా, హీరోయిన్లకీ చెప్తారు. నచ్చితేనే, హీరోయిన్లు ఆ పాత్రలకు ఒప్పుకుంటారు. వాళ్ళలా ఒప్పుకుంటేనే, సినిమా ముందుకు వెళుతుంది ఆమెతో.

ఇప్పటికైనా, ఈ చర్చ జరుగుతున్నందుకు సంతోషంగా వుందంటూ కొందరు నటీమణులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

చాలా సినిమాల్లో అసలు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం వుండటం లేదన్నది బహిరంగ రహస్యం. పూర్తిగా హీరోయిన్ల పాత్రల్ని సినిమా విడుదలయ్యాక కట్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.

తప్పెవరిది.? అంటే, సమిష్టిగానే ఆ తప్పుకు బాధ్యత వహించాల్సి వుంటుంది. ఈ చర్చ నిజానికి మంచిదే. ముందు ముందు హీరోయిన్లకీ, సినిమాల్లో బలమైన పాత్రలు వుండాలి. వుంటాయని ఆశిద్దాం.

అన్నట్టు, ‘పెద్ది’ సినిమాలోని వల్గర్ సీన్స్‌కి కత్తెర వేస్తున్నట్లు స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించాడు.

‘దేవర’ సినిమాలోనూ జాన్వీ కపూర్, గ్లామరసమైన పాత్రలో కనిపించింది తప్ప, నటిగా ఆమెకు ఆ సినిమా మంచి పేరేమీ తీసుకురాలేదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group