Home » ట్రెండింగ్ టాపిక్: కాబోయే భర్తని కాటికి పంపేసిన కాబోయే భార్య.!

ట్రెండింగ్ టాపిక్: కాబోయే భర్తని కాటికి పంపేసిన కాబోయే భార్య.!

by hellomudra
0 comments
Ketan Agarwal Siya Goel

Ketan Agarwal Siya Goel..హెడ్డింగ్ అదిరిపోయింది కదా.! ఏం, ఎప్పుడూ భార్యల్ని భర్తలు అంతమొందించడమేనా.? ఫర్ ఎ ఛేంజ్.. భర్తల్ని భార్యలు కడతేర్చితే తప్పేంటట.?

నిజమే, ట్రెండ్ మారిపోయింది.! అను నిత్యం వార్తల్లో, భర్తను చంపేస్తున్న భార్యల కథల్ని చూస్తూ వస్తున్నాం. అసలేం జరుగుతోంది.?

మహిళా సంఘాల తరహాలో, ఇప్పుడు కొత్తగా పురుష సంఘాలు పుట్టుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. షీ టీమ్స్ తరహాలో, హీ టీమ్స్‌ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.

అన్నట్టు, మహిళా రిజర్వేషన్ల తరహాలో పురుషులకీ రిజర్వేషన్లు ముందు ముందు తప్పకపోవచ్చు. మగాళ్ళంతా తమ రక్షణ కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే రోజులు వచ్చేస్తున్నాయ్.!

ఓ వ్యక్తి, 17 కోట్లు వెచ్చించి ఘనంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే, కొండ మీద నుంచి జారి, లోయలో పడిపోయాడు.

Ketan Agarwal Siya Goel.. పడిపోలేదు.. పడగొట్టేశారు..

అంతే, కాబోయే భర్త అలా చనిపోవడంతో కాబోయే భార్య షాక్‌కి గురయ్యింది. లబోదిబోమని ఏడ్చేసింది. పోలీసులు, కేసు నమోదు చేశారు. విచారణ షురూ చేశారు.

ఎక్కడో పోలీసులకు చిన్న అనుమానం కలిగింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. అది ప్రమాదం కాదు, హత్య.. అని తేలింది.

కాబోయే భర్తని కాబోయే భార్యే చంపించేసిందనేది పోలీసులు ప్రాథమికంగా తేల్చిన అంశం. కాబోయే భార్యగారికి ఓ ప్రియుడు వున్నాడట. ఆ ప్రియుడి సాయంతో కాబోయే భర్తని కడతేర్చేసిందా కాబోయే భార్య.

Ketan Agarwal Siya Goel
Ketan Agarwal Siya Goel

పెళ్ళి కోసం 17 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాడు.. బోల్డన్ని ప్లాన్స్ వేసుకున్నాడుగానీ.. తనకు కాబోయే భార్యే తనను అంతమొందించడానికి స్కెచ్ వేసిందని గుర్తించలేకపోయాడా అమాయక భర్త.

నిజానికి, ఈ తరహా మర్డర్ మిస్టరీలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయినా, పెళ్ళికి ముందే నచ్చకపోతే, పెళ్ళిని రద్దు చేసేసుకోవచ్చు కదా.?

పోనీ, పెళ్ళయ్యాక నచ్చకపోతే.. విడాకులు తీసుకునే ఆప్షన్ కూడా వుంది. కానీ, ఈ చంపెయ్యడమేంటి.? చంపేశాక, సుఖంగా జీవించే అవకాశమే లేదు కదా.?

ఇప్పుడా, కాబోయే భార్య జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆమె పేరు సియా గోయల్. మృతుడేమో కేతన్ అగర్వాల్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group