Home » బిగ్ క్వశ్చన్: వైసీపీలో కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.?

బిగ్ క్వశ్చన్: వైసీపీలో కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.?

by hellomudra
0 comments
Ys Jagan Ambati Rambabu

Ambati Rambabu Kapu CM.. తెలుగు దేశం పార్టీలో నారా చంద్రబాబునాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థి.. జన సేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా.? లేనే లేదు.!

ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనివార్య కారణాల వల్ల పోటీ చేయాల్సిన పరిస్థితి లేకపోతే, ఆయనకు బదులుగా వైఎస్ భారతి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారు.

అదీ కుదరకపోతే, వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి విజయమ్మ లేదా, సోదరి షర్మిలని అయినా వైఎస్ జగన్ రంగంలోకి దించుతారేమో.!

అంతే తప్ప, కాపు సామాజిక వర్గానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థగా అవకాశం కల్పించే అవకాశమే లేదన్నది బహిరంగ రహస్యం.

మరి, కాపులం.. కదనరంగంలోకి దిగుతున్నాం.. కలిసి సత్తా చాటుతాం.. అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఎందుకు వ్యాఖ్యానించినట్లు.?

ఇదంతా, కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టడానికే. దానికి, ‘కాపు బ్రాండ్’ ఎందుకు తగిలించుకోవడం.? చేతనైతే, వైసీపీలోని కాపు నేతలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం తెచ్చుకుంటాం.. అని కదా, అంబటి అనాలి.?

అంబటి రాంబాబు కావొచ్చు, బొత్స సత్యనారాయణ కావొచ్చు.. ఇంకో కాపు నేత కావొచ్చు.. వీళ్ళందరికీ తెలుసు, వైసీపీలో కాపు అభ్యర్థికి ముఖ్యమంత్రిగా అవకాశం రానే రాదని.

‘జనం నాకు ఓట్లేస్తే, నేను ముఖ్యమంత్రినవుతానేమో..’ అని తాజాగా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

అలా జనం, అంబటి రాంబాబుకి ఓట్లెయ్యాలంటే, ముందు వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబు పేరు ప్రకటితమవ్వాలి. లేదా, వైసీపీని వీడి అంబటి రాంబాబు, కొత్త రాజకీయ పార్టీ పెట్టాలి.

ఇదంతా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఒకవేళ అంబటి, తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటే, ఆ తర్వాత పరిణామాలు వేరేలా వుంటాయ్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group