Home » ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ అల్టిమేటం.! ఇకనైనా ‘ఆర్మీ’ ఆగుతుందా.?

ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ అల్టిమేటం.! ఇకనైనా ‘ఆర్మీ’ ఆగుతుందా.?

by hellomudra
0 comments
Allu Arjun

Allu Arjun Army Trolling.. అల్లు అర్జున్, తన ఆర్మీతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆర్మీ అంటే, అభిమానులే.!

కాకపోతే, హీరోలకి అభిమానులుంటారు.. నాకు ఆర్మీ వుంది.. అని అంటుంటాడు అల్లు అర్జున్.. కాస్త కొత్తగా.! అభిమానులూ, ‘ఆర్మీ’ అనే పేరుతో హడావిడి చేస్తుంటారు.

ఎవరిష్టం వాళ్ళది.? అభిమానులు, తమ ఐక్యతను చాటుకునేందుకు ‘ఆర్మీ’ అని పెట్టుకోవచ్చు.. కానీ, ఆర్మీ అంటే, దేశ రక్షణకు సంబంధించిది కాబట్టి.. చిన్నపాటి విమర్శలు తప్పవు.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియా వేదికగా అల్ల అర్జున్ అభిమానులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.. అదీ, అత్యంత జుగుప్సాకరం.

ఈ విషయంలో ఏ హీరో అభిమానులూ తక్కువ కాదు. అసలు వాళ్ళు ఆయా హీరోలకి నిజమైన అభిమానులేనా.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంటుంది.

హీరోలంతా కలిసే వుంటారు.. కానీ, అభిమానులూ హద్దులు దాటుతుంటారు.. తమ అభిమాన నటులకు హద్దులు గీస్తుంటారు. అదే అసలు సమస్య.

Allu Arjun Army Trolling.. అల్లు అర్జున్ అభిమానుల రూటే సెపరేటు..

ఇక, అల్లు అర్జున్ అభిమానులైతే ఎవర్నీ వదిలిపెట్టరు.. అందర్నీ ట్రోల్ చేస్తుంటారు.. అదీ, అత్యంత జుగుప్సాకరంగా. ఈ విషయం అల్లు అర్జున్ నోటీసుకి వెళ్ళి వుండొచ్చు.

అందుకే, అభిమానులతో ఆప్యాయంగా ఇంటరాక్ట్ అయిన సమయంలో, సున్నితంగానే అభిమానులకు చురకలు అంటించాడు అల్లు అర్జున్.

‘మనకి ఇష్టం లేనివారిని పట్టించుకోవడం మానేద్దాం. వారి కోసం సమయాన్ని ఎందుకు అనవసరంగా వెచ్చించడం.?’ అంటూ హిత బోధ చేశాడు అభిమానులకి అల్లు అర్జున్.

‘ట్రోలింగ్ చేయడం కన్నా, మీ లవర్ ఇంటి ముందు నిల్చోండి.. ఆనందమైనా వస్తుంది..’ అని సెలవిచ్చాడు అల్లు అర్జున్ ఆశ్చర్యకరంగా.

బానే వుంది కదా.! దాదాపుగా అందరు హీరోలూ ఇదే మాట చెబుతారు. ఎవరూ, తమ అభిమానులు ఇంకో హీరోని ట్రోల్ చెయ్యాలని చెప్పరుగాక చెప్పరు.

మొత్తమ్మీద, అల్లు అర్జున్ క్లాస్ పీకిన దరిమిలా, అతని అభిమానులు మారతారా.? ట్రోలింగ్ ఆపేస్తారా.? అన్నది వేచి చూడాల్సందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group