Home » గంధర్వ కన్యలు ‘రంభ, ఊర్వశి, మేనక’లపై సినీ బూతు పురాణం.!

గంధర్వ కన్యలు ‘రంభ, ఊర్వశి, మేనక’లపై సినీ బూతు పురాణం.!

by hellomudra
0 comments
Rambha Urvashi Menaka

Rambha Urvashi Menaka Cinema Vulgarity.. రంభ ఎవరు.? ఊర్వశి ఎవరు.? అసలు మేనక అంటే ఎవరు.? నిజానికి, తెలుగు తెరపై ఈ మూడు పాత్రల్నీ చాలాకాలంగా అత్యంత అసభ్యకరమైన రీతిలో చూపిస్తూ వస్తున్నారు.

అయితే, రంభ అలానే ఊర్వశి, మేనక.. ఈ ముగ్గురూ గంధర్వ కన్యలు. స్త్రీ అందాన్ని పొగడాలంటే, రంభ అలానే ఊర్వశి, మేనకలతో పోల్చుతాం.

దురదృష్టవశాత్తూ, రంభ ఊర్వశి మేనక.. అంటే, శృంగార తారలుగా మారిపోయారు.. అదీ, సినిమా పైత్యం. దశాబ్దాలుగా నడుస్తోంది ఈ పైత్యం.

తాజాగా, ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కి, విడుదలకు సిద్ధమవగా, సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయి.

సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారనీ, గంధర్వ కన్యల్ని అత్యంత అసభ్యకరంగా చూపిస్తున్నారనేది కొందరి ఆరోపణ.

దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది కదా.? అంటే, ఎక్కడో ఒక చోట.. ఈ పైత్యానికి విరుగుడు కనిపెట్టి తీరాల్సిందే. అదే, ఇప్పుడు జరుగుతోంది.

ఇంతకీ, రంభ అలానే ఊర్వశి, మేనక గురించి ఎవరికన్నా ఏమన్నా తెలుసా.? అంటే, చాలామందికి తెలిసీ, తెలియనట్టుగా.. కొంత కొంత తెలుసంతే.

మేనక, క్షీర సాగర మధనం సందర్భంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తుండగా, తపో భంగం కోసం మేనకను పంపుతాడు ఇంద్రుడు. అదో మహత్కార్యం.

నారాయణ మహర్షి, తపోశక్తితో ఊర్వశిని సృష్టిస్తాడు. ఇంద్ర సభలోని అప్సరసలందరిలోకీ ఊర్వశి అత్యంత అందగత్తె. భూలోక మహారాజు పురూరవుడ్ని పెళ్ళాడుతుంది ఊర్వశి.

మహాభారతంలో అర్జునుడిని మోహించి, అతని నిరాకరణతో ఆగ్రహించి, నపుంసకుడిగా అర్జునుడు మారేలా శపిస్తుంది. అర్జునుడు బృహన్నలగా మారింది ఊర్వశి శాపంతోనే.

రంభ కూడా సముద్ర మధనంలోనే జన్మిస్తుంది. దేవలోకంలో అప్సరసలందరికీ రాణి రంభ. రావణుడు ఏ స్త్రీని అయిష్టంగా తాకినా భస్మమైపోతాడనే శాపం వుంది కదా.. ఆ శాపం, పరోక్షంగా రంభ వల్లే సంభవిస్తుంది.

ఇలా, రంభ అలానే ఊర్వశి, మేనక పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పురాణాలు అంటే, ఇది మన చరిత్ర. మన సనాతన ధర్మం.

ముందే చెప్పుకున్నట్లు, సినిమాల్లో గ్లామర్ కోసం రంభ, ఊర్వశి, మేనక పాత్రల్ని అత్యంత జుగుప్సాకరంగా మార్చేశారు. ఇకనైనా, ఆ పద్ధతి మారుతుందని ఆశిద్దాం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group