Artificial Super Intelligence Threats.. అదేంటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కదా.. ఇంజినీరింగ్ విద్యార్థులు, ‘ఏఐ – ఎంఎల్’ బ్రాంచ్‌కి ప్రాధాన్యతనిస్తున్నది.?
వంద కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చనిపోతారంటూ ఏకంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెప్పడమేంటి.?
ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. బహుశా బిల్ గేట్స్‌కి వయసు మీద పడ్డం వల్ల, ఇలా చాదస్తం పెరిగిపోయిందేమో.! ఇది కొందరి భావన.
కానీ, కోవిడ్ కంటే వేగంగా.. క్యాన్సర్ కంటే భయానకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ప్రమాదకరంగా మారుతోందన్న అభిప్రాయాలూ లేకపోలేదు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని వినియోగించడం వల్ల ‘పని’ సులభతరం అవుతోంది. ఇదైతే వాస్తవం. కానీ, మనకెలా కావాలో.. అలా ఔట్‌పుట్ రాదు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో.
‘ఏఐ టూల్స్’ ఏం ఇస్తే, దాంతో మనం సరిపెట్టుకోవాలి.! ఓ పోస్టర్ డిజైన్ కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. ఏఐ టూల్ ద్వారా వచ్చినదాన్ని చూసి మురిసిపోతున్నాం. కానీ, మనక్కావాల్సినట్లే అది ఇస్తోందా.? అన్నదెవరూ చూసుకోవడంలేదు.
కోడింగ్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతోంది. చాల్లే, మనం అనుకున్నదానికి దగ్గరదాకా వచ్చింది కాబట్టి, సరిపెట్టేసుకుందామనుకుంటున్నారంతా.
బ్యాంకింగ్ సెక్టార్ సహా, వివిద రంగాల్లో ఏఐ టూల్స్ వినియోగం వల్ల ‘డేటా సెక్యూరిటీ’ విషయంలో సమస్యలు ముందు ముందు తీవ్రాతి తీవ్రం కాబోతున్నాయి.
హ్యాకింగ్.. హ్యాకింగ్.. ఔను, ఏఐ టూల్స్‌ని ఎక్కువగా ఈ హ్యాకింగ్ కోసం ఈ మధ్య వినియోగిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో అత్యంత ప్రమాదకర పరిణామాలకు తావివ్వబోతోంది.
మనిషి భద్రతకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు.. అనే భయాలు ఇప్పుడిప్పుడే పెరిగిపోతున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాదు, సూపర్ ఇంటెలిజెన్స్.. అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకురావడంతో ఈ బయాలు వందల రెట్లు పెరుగుతున్నాయిప్పుడు.
పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల్ని ఏఐ టూల్స్ ద్వారా ఛేదించడం.. ఈ క్రమంలో ఓ ఐఐటీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
ఏమో, భవిష్యత్ ఎలా వుంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు దూరం కాకూడదంటే, ఏఐ టూల్స్‌పై నియంత్రణ తప్పదు. మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేసే ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అవసరమా మనకి.?
సాంకేతికత కొత్త పుంతలు తొక్కాల్సిందే. కానీ, ఆ సాంకేతికతని మనం ఎలా వినియోగిస్తున్నామన్నదానిపైనే విస్తృత చర్చ జరగాలి.
భద్రత లేని సాంకేతిక, మానవాళి వినాశనం దిశగా అభివృద్ధి చెందితే, అలాంటి అభివృద్ధికి అడ్డుకట్ట వేసి తీరాల్సిందే.
