Home » వైఎస్ జగన్ పాదయాత్రకి చంద్రబాబు ‘బ్రేకులు’ వేస్తారా.?

వైఎస్ జగన్ పాదయాత్రకి చంద్రబాబు ‘బ్రేకులు’ వేస్తారా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan

YS Jagan Padayatra 2027.. వచ్చే ఏడాది తన పాదయాత్ర వుంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.

2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందట. అంటే, దాదాపు ఏడాది సమయం వుందన్నమాట.!

కళ్ళు మూసుకుంటే ఏడాది ఇట్టే గడిచిపోతుంది.. ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పేమాట.! సరే, అలా ఆయన అనడం సబబేనా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాదయాత్ర కొత్త కాదు. గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు.

YS Jagan Padayatra 2027.. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా..

గతంలో పాదయాత్ర చేసిన నాటి పరిస్థితులు వేరు, వచ్చే ఏడాదిలో ప్రారంభించబోయే పాదయాత్ర సమయానికి మారే పరిస్థితులు వేరు.

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన రాజకీయ ప్రత్యర్థుల రాజకీయ యాత్రలకు అడ్డు తగిలిన సంగతి తెలిసిందే.

పోలీస్ శాఖ తరఫున చిత్ర విచిత్రమైన నిబంధనలు తీసుకొచ్చి, రాజకీయ ప్రత్యర్థుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. అవన్నీ వైసీపీకి శాపంగా మారాయి 2024 ఎన్నికల్లో.

వాస్తవానికి, పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవి న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సంబంధిత వ్యవహారాలవి.

వారాంతంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి, కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పట్లో.

ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారాయన. అదే, ఆ మినహాయింపు ఆయనకు ఇప్పటికీ కొనసాగుతోంది.

ఒక్క ఛాన్స్.. అదిప్పుడు కుదరదేమో.!

‘ఒక్క ఛాన్స్’ అంటూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం వేరు.. ఆల్రెడీ ఐదేళ్ళు పరిపాలించి, ఆ తర్వాత దారుణ పరాజయాన్ని చవిచూశాక, ఇప్పుడు మొదలెడతానంటున్న పాదయాత్ర వ్యవహారం వేరు.

చాలాకాలం క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర.. తెలుగు నేలపై రాజకీయాల్లో సరికొత్త సంచలనం. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు.

వైఎస్ జగన్, నారా లోకేష్, షర్మిల.. ఇలా చెప్పుకుంటూ పోతే, తెలుగు నేలపై చాలా పాదయాత్రలున్నాయ్. ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకే వెళ్ళడంలేదు వైఎస్ జగన్, 2024 ఎన్నికల తర్వాత.

Also Read: నాగవంశీకీ నవ్య స్వామికీ మధ్య ‘ఎఫైర్’.! ఈ ‘నెగెటివిటీ’ ఎవరి పని.?

ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ మీద ప్రజల్లో సింపతీ వేవ్ కష్టం. సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది.

అయితే, పాదయాత్ర నాటికి అన్నీ సెట్టయిపోతాయని వైసీపీ బలంగా నమ్ముతోంది. పాదయాత్రలో కూటమి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని ఏ చిన్న ఇబ్బంది పెట్టినా, అది వైసీపీకి అడ్వాంటేజ్ అన్నది ఆ పార్టీ ఆశాభావం.

మరి, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.! అన్నట్టు, నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే, చంద్రబాబుని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group