Home » పదే పదే ఏడిస్తే సీఎం పదవి వస్తుందా.?

పదే పదే ఏడిస్తే సీఎం పదవి వస్తుందా.?

by Mudra369 Editorial Desk
0 comments
Botcha Satyanarayana

Botcha Satyanarayana Cries Again.. బొత్స సత్యనారాయణ అంటే, ఉత్తరాంధ్రలో పవర్ సెంటర్.. అనదగ్గ స్థాయి రాజకీయ నాయకుడు.! కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారాయన.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయంగా ఎదిగిన బొత్స మంత్రి పదవుల్నీ వెలగబెట్టారు. వైఎస్ జగన్ హయాంలోనూ మంత్రిగా పని చేశారు బొత్స సత్యనారాయణ.

రాజకీయంగా ఎన్ని వివాదాలున్నా, బొత్స సత్యనారాయణకి అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలున్నాయి. అదే మ్యాజిక్కు.!

సీనియర్ పొలిటీషియన్.. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పే వయసు.! ఈ వయసులో బొత్స సత్యనారాయణ, పదే పదే ఏడుస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

‘ప్రత్యక్ష రాజకీయాల్లో ఇకపై కొనసాగలేను..’ అని వైసీపీ అధినాయకత్వానికి గతంలోనే తేల్చి చెప్పేశారు బొత్స. ఈ క్రమంలోనే ఆయన్ను శాసన మండలికి పంపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.

Botcha Satyanarayana Cries Again.. బలహీన పడ్డ బొత్స..

ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను గుడ్ డై చెప్పడంతో, బొత్స రాజకీయంగా బలహీనపడ్డారు.

బొత్స అంటే, కేవలం బొత్స సత్యనారాయణ మాత్రమే కాదు. విజయనగరం జిల్లాలో ఓ బలమైన కుటుంబ నేపథ్యం. బొత్స కుటుంబంలో చాలామంది నాయకులున్నారు.

అన్నట్టు, బొత్స సతీమణి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు గతంలో. ఇప్పుడు బొత్స వారసురాలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మజ్జి శ్రీను వైసీపీని వీడటంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట బొత్స. ఈ క్రమంలోనే పదే పదే ఏడుపు లంకించుకుంటున్నారాయన పబ్లిక్‌గానే.

ఏడుపు.. ఓ వృధా ప్రయాస..

అయితే, రాజకీయాల్లో ఇలాంటి ఏడుపులు చెల్లవు.! వీటి వల్ల వీసమెత్తు ఉపయోగం కూడా వుండదు రాజకీయంగా ఏ రాజకీయ నాయకుడికి అయినా.

గతంలో చంద్రబాబు, మీడియా సమావేశంలో ఏడ్చారు. ఆ సందర్భం వేరు. అసెంబ్లీలో చంద్రబాబుకి ఎదురైన అవమానాలు, చంద్రబాబు సతీమణి పేరుని తీసుకొచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు బాధపడ్డారు.

Also Read: సినిమా రివ్యూ ‘మారెమ్మ’.! మరీ ఇంతలా విసిగించేశావేంటమ్మా.!

కానీ, బొత్స విషయంలో అలా ఏం జరగలేదు కదా.? మరెందుకు బొత్స పదే పదే ఏడుస్తున్నట్లు.? బొత్స కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, వైసీపీలో చేరారు కదా.!

ఏదిఏమైనా, బొత్స కంటతడి వ్యవహారం బెడిసికొడుతోంది. వైసీపీ నానాటికీ నిర్వీర్యమైపోయిందన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి.!

ఎంత ఏడ్చినా వైసీపీలో సీఎం అభ్యర్థిత్వాన్ని బొత్స సత్యనారాయణకి వైసీపీ అధినేత జగన్ ఇచ్చే అవకాశమే లేదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group