Home » స్టైలింగ్ & ట్రెండింగ్: వికసించిన నీలి కలువ ఆండ్రియా.!

స్టైలింగ్ & ట్రెండింగ్: వికసించిన నీలి కలువ ఆండ్రియా.!

by Mudra369 Editorial Desk
0 comments
Andrea Jeremiah

Andrea Jeremiah Styling Trending.. రాయల్ బ్లూ కస్టమ్ క్రాప్ టాప్‌లో మెరిసిపోతున్న ఈ అందాల భామని గుర్తించే వుంటారుగా.!

అప్పుడెప్పుడో ‘యుగానికి ఒక్కడు’ సినిమాలో కార్తీకి జోడీగా నటించిన ముద్దుగుమ్మ ఆండ్రియా.

ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సైంధవ్’ సినిమాలో జాస్మిన్‌గా కనిపించి మెప్పించింది.

కమెడియన్ సునీల్ సరసన ఓ సినిమాలో ట్రెడిషనల్ రోల్ పోషించి అదరగొట్టింది.

అలాగే, పలు యాక్షన్ రోల్స్‌లోనూ సత్తా చాటిన ఆండ్రియా కేవలం నటి మాత్రమే కాదండోయ్ సింగర్ కూడా. ఆ విషయం కూడా చాలా మందికి తెలిసిందే.

Andrea Jeremiah Styling Trending.. ఫ్యాషన్ ట్రెండ్స్‌ ఫాలో అవడంలో..

ప్రస్తుతం వెట్రిమారన్, సెంథిల్ కుమార్ తదితర తమిళ దర్శకులతో విలక్షణమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఆండ్రియా.

ఇక లేటెస్ట్ పిక్స్ విషయానికి వస్తే.. ఇక్కడ ఆండ్రియా ధరించిన డ్రస్ సింప్లీ సూపర్బ్ అనేయొచ్చు. రాయల్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌తో రూపొందిన ఆ హాల్టర్ టాప్‌పై వున్న ఫ్లవర్ డిజైన్ స్పెషల్లీ ఎట్రాక్టివ్.

అచ్చంగా ఓ నీలి కలువ ఆండ్రియా ఛాతీ భాగంలో అలా వచ్చి అరవిరిసిందా.? అన్నట్లుగా డిజైన్ చేశారు.

Andrea Jeremiah
Andrea Jeremiah

బ్లూ కలర్ పెటల్స్ పై వున్న బ్లాక్ కలర్ టఫ్ స్వీక్వెన్స్ అండ్ గ్లిట్టర్ వర్క్ ఆ టాప్ అందాన్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

మెడకు హాల్టర్ నెక్ టై అప్ వుండడంతో ఈ టాప్‌కి అద్భుతమైన లుక్ అద్దినట్లయ్యింది. షోల్డర్ మరియు నెక్ లైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తున్నాయ్.

టాప్‌ ఫ్యాబ్రిక్‌కి మ్యాచింగ్ కలర్ డీప్ బ్లూ స్వీక్వెన్స్ స్కర్ట్ ఎంచుకోవడంతో పూర్తి డ్రస్‌కి ఒక రిచ్ అండ్ నైట్ గ్లామ్ లుక్ యాడ్ అయ్యింది.

Andrea Jeremiah
Andrea Jeremiah

స్మోకీ ఐ షాడో అద్దిన ఆండ్రియా కళ్లు సింపుల్‌గా ఎట్రాక్ట్ చేసే న్యూడ్ పింక్ లిప్ ‌స్టిక్ ఓవరాల్‌గా ఆండ్రియా లుక్స్ యూత్‌ని కట్టిపడేస్తున్నాయ్.

హెయిర్ అంతటినీ ఒక సైడ్‌కి చేర్చి లూజ్‌గా వదిలేసిన విధానం ఆమె లుక్‌కి మరింత గ్రేస్ తెచ్చింది.

అన్నింటికీ మించి అద్భుతంగా డిజైన్ చేసిన ఆమె చేతి గాజులు (మెటాలిక్ డిజైన్) మోడ్రన్ వెస్ట్రన్ శైలికి ఇండో వెస్ట్రన్ టచ్ ఇస్తున్నట్లున్నాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group