Nakshatra Thella Kaagitham.. ఎవరీ అమ్మాయి.? ఇంత క్యూటుగా వుంది.? ‘తెల్ల కాగితం’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాక, సినీ పరిశ్రమలోనూ, సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఇదే చర్చ.
మామూలు యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్. మీడియాతోనూ చాలా క్యూట్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే, ఎలా వైరల్ అవుతాననేది ఆమెకి బాగా తెలుసు.
హీరో హర్ష్ రోషన్ కంటే ఎక్కువగా, హీరోయిన్ నక్షత్ర.. అంతలా ‘తెల్ల కాగితం’ సినిమా ప్రమోషన్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
‘తెల్ల కాగితం’ సినిమాతో పాటు, పలు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ‘నక్షత్ర’ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు.. అదీ, ‘తెల్ల కాగితం’ సినిమా కంటే ఎక్కువగా.

ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం నక్షత్ర ధరించిన కాస్ట్యూమ్స్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి. కాస్త బొద్దుగా వుందేమో, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా వున్న నక్షత్ర వైపు కెమెరా కళ్ళు అతుక్కుపోయాయంటే అతిశయోక్తి కాదు.
నిజానికి, ఈ మధ్య కొత్త హీరోయిన్లంతా చాలా ప్రిపేర్డ్‌గా వస్తున్నారు. మీడియా ముందుకొస్తే, ఎలాంటి ప్రశ్నలొస్తాయి.? వాటిని ఎలా డీల్ చేయాలి.? అన్నదానిపై ‘క్రాష్ కోర్స్’ ఏదన్నా చేస్తున్నారో ఏమో.
‘నక్షత్ర’ మీడియాని డీల్ చేసిన తీరు చూసి, మీడియా వర్గాల్లో కూడా ఇదే జరిగింది. ‘పెయిడ్ పీఆర్ సొంతంగా చేయించుకుందా.?’ అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయ్ మీడియా వర్గాల్లో.

ఏదైతేనేం, కోరుకున్న పబ్లిసిటీ నక్షత్రకి వచ్చేసింది. ఇక, వరుసగా అవకాశాలు రావడమే తరువాయి.! ‘తెల్ల కాగితం’ సినిమాకి జస్ట్ ఓకే.. అంటూ రివ్యూలొచ్చాయ్.
రివ్యూలతో సంబంధం లేదు కదా.. కంటెంట్ గనుక టార్గెటెడ్ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది.
చూస్తున్నారు కదా.. ఇవన్నీ, నక్షత్ర తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసినవే. కాకపోతే, ‘తెల్ల కాగితం’ ప్రమోషన్లలో కాస్త బొద్దుగా కనిపించిన నక్షత్ర, ఇక్కడేమో కాస్త స్లిమ్‌గా కనిపిస్తోంది.