Girija Oak Godbole Trending Again.. ‘నవ్వే నవరత్నమాయెలే.! నీ మాటే ముత్యాల మూటేలే..’ అంటూ భావుకత వున్ననెటిజన్లు ఈ నటిని తెగ ట్రెండింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఇంతకీ ఎవరీ నటి.? ఏంటా కథ.! పేరు గిరిజా ఓక్ గోడ్బోలే. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్‌లతోనూ ఫేమస్ అయ్యింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమంత ఎక్కువేం కాదు.
కానీ, సోషల్ మీడియాలో ఈ మధ్య గిరిజా ఓక్ ట్రెండింగ్ గురించి వింటే షాకవ్వాల్సిందే. ఆమె నవ్వుకు పడిపోతున్నారు. ఆమె మాటకు ముగ్ధులైపోతున్నారు.
Girija Oak Godbole Trending Again.. బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్.!
ఆ రేంజ్లో వుంది అమ్మడి ట్రెండింగ్ టాలెంట్. అసలెందుకింత హంగామా జరుగుతోంది నెట్టింట గిరిజా ఓక్ గురించి.!
షారూఖ్‌ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో గిరిజా పోషించిన కమాండో పాత్రతో బాగా పాపులర్ అయ్యింది.
ఆ పాత్ర కోసం ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగా పాపులర్ అయ్యాయ్. ఆ తర్వాత ఆమెకు నేచురల్‌గానే ఫాలోవర్స్ బాగా పెరిగారు.

పెరిగిన ఫాలోవర్స్ ఊరకే వుండలేదు. ఆమె గురించి గూగుల్ సెర్చ్ మొదలెట్టేశారు. ఇంకేముంది.! సినిమాతోనే కాదు, సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గిరిజా టాలెంట్ బయటపడింది.
సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్, స్క్రీన్ ప్రెజెన్స్,. మరియు చీరకట్టులో డిగ్నిఫైడ్ పోజులు.. ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి హెవీ మేకప్ లేకుండానే నేచురల్ క్లాసిక్ లుక్స్‌తో ఎట్రాక్ట్ చేసే ఆమె ఎలిగెన్స్ అంతా నెటిజనానికి తెగ నచ్చేసింది.
అంతేనా.! రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్‌లో బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్‌గా ఆమె మాట్లాడిన వైనం చాలా సహజ సిద్ధంగా అనిపించింది.
ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా గ్రౌండెడ్‌గా మాట్టాడేయడం యూత్‌కి తెగ నచ్చేసింది.
నేచురల్ ఇండియన్ ఛార్మ్.!
దాంతో ఆమె ఏజ్‌ని కూడా డేర్ చేయకుండా.. నేషనల్ క్రష్ అంటూ వైరల్ చేసేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ హంగామా కాస్త సద్దుమణిగింది.
తన పర్సనల్ హ్యాండిల్లో గిరిజా పోస్ట్ చేసిన తాజా ఫోటోలు మళ్లీ ఆమెను ట్రెండింగ్ చేస్తున్నాయ్. రెడ్ కలర్ అవుట్ ఫిట్‌లో సేమ్ కాన్ఫిడెంట్ లుక్స్‌లో గిరిజా ఇచ్చిన పోజులు యూత్‌ని ఇంకోసారి క్రష్ చేస్తున్నాయ్.

గ్లామర్ పేరుతో రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు గట్రా చేయించుకోవడం.. నేచురాలిటీకి దూరంగా హెవీ మేకప్ చేసుకుని ఫోటో షూట్లకు సిద్ధమవ్వడంలాంటివి చెయ్యదు గిరిజా ఓక్.
వాటికి దూరంగా వుండటం వల్లేనేమో సహజసిద్ధమైన స్వచ్ఛమైన ‘ఇండియన్ క్లాసిక్ ఛార్మ్’ ఆమెను ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రెండింగ్ చేస్తోంది.