Home » తప్పు కదా తమన్.!

తప్పు కదా తమన్.!

by Mudra369 Editorial Desk
0 comments
Thaman

Thaman Nagavamsi Aadrasha Kutumbam.. సంగీత దర్శకుడు తమన్ చాలా మంచోడు. ఈ విషయం సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసు. కానీ, తమన్‌కే కోపమొస్తే.?

తన సినిమాలకు సంగీతం అందించడానికే క్షణం తీరిక లేకున్నా, వేరే సినిమాలకు కూడా అవసరాన్ని బట్టి, చివరి నిమిషంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసి ఇస్తుంటాడు.

అలాంటి తమన్, తాను సంగీత దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంబంధించి, నిర్మాతనే కొట్టబోయాడంటే, వ్యవహారం పెద్దదే మరి.!

ఏ సినిమా.? ఎవరా నిర్మాత.? ఎందుకు, తమన్ ఆ నిర్మాతని కొట్టబోయాడు.? ఇప్పుడీ అంశం సినీ పరిశ్రమలో అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Thaman Nagavamsi Aadrasha Kutumbam.. దటీజ్ ఓవరాక్షన్ నాగవంశీ..

నిర్మాత నాగవంశీ తెలుసు కదా.? తెలియకపోవడమేంటీ.. మీడియా ముందు సెటైరికల్‌గా మాట్లాడే అతి కొద్ది మంది నిర్మాతల్లో ఆయనా ఒకరు.

యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అనే గుర్తింపు కూడా నాగవంశీ సొంతం. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయమై, ‘పాట కావాలి’ అనడిగితే, ‘సినిమా ఆపెయ్యాలా.?’ అన్నాడట తమన్.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా, విడుదలకు ముందు నానా తంటాలూ పడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ వుండటంతో, సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు.

ఈ అంశంపైనే మీడియా ముందు స్పష్టత ఇచ్చిన నాగవంశీ, ‘ఈ పరిస్థితుల్లో పాట కావాలి’ అనడిగితే, ‘తమన్ నన్ను కొట్టడానికి లేచాడు’ అంటూ నాగవంశీ వ్యాఖ్యానించాడు.

నిజంగా, తమన్ అలా అంటాడా.? ఛాన్సే లేదు.! కాకపోతే, కాస్త ఎక్కువ చెబుతుంటాడు ఇలాంటి సందర్భాల్లో నాగవంశీ. అదే, అతనికి పెద్ద మైనస్ అవుతోంది ప్రతిసారీ.

ఆదర్శ కుటుంబం.. ఎన్ని కష్టాలో..

వాస్తవానికి, ‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సినిమా రిలీజ్ చేయడానికి. చివరి నిమిషంలో తలనొప్పులు ఏ సినిమాకైనా మామూలే.

తమన్ వర్క్ ఎలా వుంటుందో చాలా సినిమాల విషయంలో చూశాం. ‘ఓజీ’ సినిమాకీ చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పలేదు. కానీ, బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్.

‘ఆదర్శ కుటుంబం’ సినిమాకి తమన్ ఎలాంటి ఔట్‌పుట్ ఇవ్వబోతున్నాడన్నది చూడబోతున్నాం. పైగా, త్రివిక్రమ్ అంటే తమన్‌కి వెరీ వెరీ స్పెషల్ ప్రేమ.

మొత్తమ్మీద, నాగవంవీ అత్యుత్సాహంతో చేసిన ‘కొట్టబోయాడు’ వ్యాఖ్యలు, సంగీత దర్శకుడు తమన్ పేరుని, ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ సమయంలో హెడ్‌లైన్స్‌గా మార్చేసిందన్నమాట.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group