Home » కాస్మొటిక్ సర్జరీ.! హీరోయిన్ల గ్లామరస్ కష్టాలిలా వుంటాయ్.!

కాస్మొటిక్ సర్జరీ.! హీరోయిన్ల గ్లామరస్ కష్టాలిలా వుంటాయ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Nivetha Pethuraj

Nivetha Pethuraj Lip Surgery.. అప్పుడెప్పుడో అతిలోక సుందరి శ్రీదేవి, తన ముక్కుకి సర్జరీ చేయించుకుందన్న వార్త, అప్పట్లో సంచలనం.!

బరువు తగ్గించుకోవడం కోసం చాలామంది నటీనటులు లైపో సక్షన్ చేయించుకోవడం గురించీ విన్నాం.! యంగ్ హీరోల్లో ‘దవడ’ సర్జరీ దగ్గర్నుంచి, చాలా సర్జరీల గురించి గాసిప్పులు చూస్తూనే వున్నాం.

అన్నట్టు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ‘లిప్స్’ అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ‘లిప్ సర్జరీ’ చేయించుకుందంటూ వచ్చిన గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు.

కొందరు, తమకు జరిగిన సర్జరీల గురించి బహిరంగంగానే చెప్పుకున్నారు. అదేం తప్పు కాదని బల్లగుద్ది మరీ చెప్పడమూ మనకు తెలుసు.

నటి మోనా చోప్రా అయితే, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి బహిరంగంగానే వెల్లడించింది.. వాటి వల్ల కలిగిన ఇబ్బందుల గురించి లెక్చర్లు దంచేసింది కూడా.

ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొలగించుకున్నా, ఆ ఇంప్లాంట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇంకెవరూ తనలా ఆ తప్పు చేయొద్దని హెచ్చరించింది కూడా.

Nivetha Pethuraj Lip Surgery.. లిప్ ఫిల్లింగ్.. నివేదా పేతురాజ్‌కి ఎందుకసలు.?

ఇక్కడ, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నటి నివేదా పేతురాజ్ ‘లిప్స్’ గురించి.!

తన పెదవుల విషయమై కెరీర్ మొదట్లో వచ్చిన విమర్శల నేపథ్యంలో సర్జరీ కోసం కాస్మొటిక్ సర్జన్ దగ్గరకు వెళ్ళిందట నివేదా పేతురాజ్.

డాక్టర్‌ని సర్జరీ గురించి అడిగితే, నివేదా పేతురాజ్‌కి గట్టిగా చీవాట్లు పెట్టేశాడట. దాంతో, నివేదా పేతురాజ్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుందట.

Nivetha Pethuraj
Nivetha Pethuraj

ఈ విషయాన్ని తాజాగా నివేదా పేతురాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పుడు, ఆ రిస్క్ తీసుకోనందుకు ఇప్పుడు ఆనందంగా వుందని చెప్పింది నివేదా పేతురాజ్.

‘మనల్ని మనం అర్థం చేసుకోవాలి.. ఆ తర్వాతే సమాజాన్ని గెలవగలం..’ అని నివేదా పేతురాజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

అన్నట్టు, నివేదా పేతురాజ్ మీద కూడా ‘లైపోసక్షన్’ పుకార్లు అప్పట్లో వినిపించాయి. అయితే, వాటిని పలు సందర్భాల్లో ఆమె కొట్టి పారేసిందనుకోండి.. అది వేరే సంగతి.

కొన్నాళ్ళ క్రితం ఓ యువకుడు, హైట్ పెరగడం కోసం సర్జరీని ఆశ్రయించడం అప్పట్లో పెను దుమారానికి కారణమైంది. సర్జరీ జరిగింది.. ఇన్ఫెక్షన్ వచ్చి, ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడా యువకుడు.

Nivetha Pethuraj
Nivetha Pethuraj

ఇలాంటివి చాలానే చూస్తుంటాం.. తమను తాము, తాము ఎలా వుంటే అలా యాక్సెప్ట్ చేయలేనివారే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు.

సెలబ్రిటీలను చూసి సామాన్యులు వాత పెట్టుకోవడం అనేది ఇటీవల సర్వసాధారణమైపోయింది. లైపో సక్షన్ అనే ప్రక్రియ చాలామంది ప్రాణాల్ని తీసేసింది.

ఎన్ని ప్రాణాలు పోయినా, కాస్మొటిక్ సర్జరీలకు వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇది యాపారం మరి.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group