Tejaswi Madivada Trendy Styling.. అప్పుడెప్పుడో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సమంత పక్కన సైడ్ రోల్ పోషించిన ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ.
ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని హాట్ అండ్ వైల్డ్ హీరోయిన్ అయిపోయింది.
బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’తో బాగా పాపులర్ అయ్యింది తేజస్వి మదివాడ. అలా సంపాదించుకున్న పాపులారిటీ తేజస్వికి మిక్స్డ్ బెనిఫిట్సే అందించిందని చెప్పొచ్చు.
బిగ్‌బాస్‌కి ముందు చిన్నా చితకా క్యారెక్టర్లు పోషించిన తేజస్వి మదివాడ.. ఆ తర్వాత ఒక్క సినిమా ఆఫర్ కూడా దక్కించుకోలేకపోయింది.
Tejaswi Madivada Trendy Styling.. ‘బిగ్’ ఇమేజ్ – వేస్ట్ ఇంపాక్ట్
కానీ, సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్‌బాస్ హౌస్లొో వున్నప్పుడు ఆమె ప్రవర్తించిన తీరుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొంది.
ఇది పబ్లిక్ ఇమేజ్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ అదీ ఒక రకంగా పాపులారిటీ పెరగడానికి కారణమైంది. దాంతో స్వతహాగా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది తేజస్వి.

ఇలా వచ్చిన ఫేమ్‌తో రకరకాల బ్రాండ్ ప్రమోషన్లు, ఫ్యాషన్ ఫోటో షూట్స్‌తో బాగానే సెటిలైపోయిందని చెప్పకనే చెప్పొచ్చు.
తాజాగా బ్లాక్ కలర్ వెల్వట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్‌లో తేజస్వి చేయించుకున్న ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.
ట్రెండీ లుక్స్‌కి యాంటిక్ జ్యూయలరీతో నెక్స్ట్ లెవల్ గ్లామర్
ఈ ఫోటో షూట్ మొత్తంలో ఆమె లుక్స్ బోల్డ్ అండ్ ట్రెండీగా వున్నప్పటికీ, ఆమె మెడలో ధరించిన నెక్లస్ ఫ్యాషన్ ప్రియులను సరికొత్తగా ఆకర్షిస్తోంది.
మెడను పూర్తిగా కవర్ చేసినట్లుగా వున్న పట్టీకి నెమళ్లతో డిజైన్ చేసిన మోటివ్స్ ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయ్. రెగ్యులర్ గోల్డ్ ఫినిష్ కాకుండా.. మ్యాటీ ఫినిషింగ్‌లో వుందీ నెక్లస్.

మోడ్రన్ లుక్‌కి ఈ నెక్లస్‌తో ట్రెడిషనల్ టచ్ ఇచ్చినట్లయ్యింది. డిఫరెంట్ లైన్ అప్‌లో చైన్స్.. వాటికి అతుక్కుని వేలాడుతున్నట్లుగా వున్న ఆ పిల్ల నెమలి ఆకారాలు అద్భుతంగా వున్నాయ్.
అలాగే గోల్డ్ కలర్ అవుట్ ఫిట్‌లోనూ తేజస్వి మదివాడ మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ అవుట్ ఫిట్‌లో కంప్లీట్ ట్రెడిషనల్ వైబ్ క్రియేట్ చేస్తోంది.
గోధుమ రంగు హెయిర్ కలర్ డిఫరెంట్ స్టైల్ అద్దింది తేజస్వి బ్యూటీనెస్కి.
ధగ ధగ మెరిసిపోయే ఆ గోల్డ్ శారీకి మ్యాచింగ్‌లో మెడకు ధరించిన గోల్డ్ చోకర్ నెక్స్ట్ లెవల్లో ఎలివేట్ అవుతూ తేజస్వి అందాన్ని మరింత క్లాసీగా మార్చేసింది.
