Home » ఈ ‘రుక్మిణీ దేవి ఆలయం’లో అన్నదానం చేయకూడదెందుకంటే.!

ఈ ‘రుక్మిణీ దేవి ఆలయం’లో అన్నదానం చేయకూడదెందుకంటే.!

by Mudra369 Editorial Desk
0 comments
Dwaraka Rukmini Mandir

Rukmini Devi Mandir Dwaraka.. ద్వారక అంటే ఠక్కున గుర్తొచ్చేది శ్రీకృష్ణుని జన్మ స్థలం.

ఎంతో పవిత్రమైన ఈ స్థలానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయ్. శ్రీ కృష్ణుడి ఇద్దరు భార్యలలో అత్యంత ప్రీతి పాత్రమైన భార్య రుక్మిణీ దేవి.

రుక్మిణిీ దేవి అంటే శ్రీ కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం సంగతి తెలిసిందే. అయితే, శ్రీ కృష్ణుడికి పలచోట్ల పలు రకాల దేవాలయాలున్నాయ్.

వాటిలోనే రుక్మిణీ, సత్యభామలతో కలిసి కృష్ణ పరమాత్ముడు కొలువుదీరి వుంటాడు.

కానీ, ఇక్కడ ప్రధాన ఆలయంలో శ్రీ కృష్ణుడు కొలువై వుండగా.. కాస్త దూరంలో సెపరేట్‌గా రుక్మిణీ దేవి ఆలయం వుండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.

అలా కృష్ణుడూ, రుక్మిణీ దేవి ఆలయాలు ఇక్కడ సెపరేట్‌గా వుండడానికి స్థల పురాణాలను కారణాలుగా చెబుతారు ఇక్కడి స్థానికులు.

Rukmini Devi Mandir Dwaraka.. దుర్వాస మహర్షి శాపం

దుర్వాస మహర్షిని ఒకరోజు తమ ఇంటికి ఆహ్వానిస్తారు రుక్మిణీ శ్రీ కృష్ణులు. ఆయనను తమతో పాటూ రథంలో తీసుకొని వస్తుండగా.. మార్గ మధ్యంలో రుక్మిణి దేవికి దాహం వేస్తుంది.

అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడే నేలపై తన కాలి బోటనవేలితో నేలను తవ్వి రంధ్రం చేసి ఆ జలధారను రుక్మిణికిస్తాడు.

అతిధిగా వున్న దుర్వాస మహర్షికి నీరు తాగుతారా.? అని అడక్కుండానే భర్త ఇచ్చిన నీటిని తీసుకుని రుక్మిణి తాగేస్తుంది.

అది చూసి కోపించిన దుర్వాస మహర్షి.. పెద్ద వాడిని, అతిధిని అయిన నాకు ముందుగా నీరు ఇవ్వకుండా నువ్వు తాగేస్తావా.? ఇది నాకు తీరని అవమానం.

Dwaraka Rukmini Devi Mandir
Dwaraka Rukmini Devi Mandir

నాకు ఇంతటి అవమానం జరిగిన ఈ ప్రాంతంలోనే ‘నువ్వు నీ భర్తకు దూరంగా ఒంటరిగా వుంటావ్.. అని శపిస్తాడు. అంతేకాదు, నాకు దాహం తీర్చని ఈ నీరు రుచి రహితంగా మారాలి.. అని కూడా శపిస్తాడు.

దాంతో అక్కడి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటూ.. దొరికే కొద్దిపాటి నీరు ఉప్పుగా వుంటుంది.

దాంతో ఈ ఆలయ చుట్టు ప్రక్కల జనం ఎప్పుడూ నీటి ఎద్దడితో బాధపడుతుంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకూ.

ఆలయ పరిసర ప్రాంతాల్లో మంచి నీటి కొరత.!

రుక్మిణీ దేవి ఆలయ పరిసర ప్రాంతాల్లో మాత్రమే నీరు ఇలా ఉప్పుగా వుండడమనే చిత్రాన్ని చూస్తాం. అందుకే ఇక్కడ ‘జలదానం’ అంత పుణ్యప్రదంగా అత్యంత ప్రత్యేకంగా చెబుతారు.

ఈ ఆలయంలో ఎటువంటి ప్రత్యేకమైన ప్రసాదం ఇవ్వబడదు. అన్నదానం కూడా జరగదు.

కేవలం ఇక్కడ మంచి నీటి దానానికే ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. ప్రత్యేక మొక్కుబడులుగా ‘జలదానం’ చేస్తుంటారు ఈ ఆలయంలో.

ఇలా జలదానం చేయడం వల్ల తర తరాల పితృ దోషాలు నివారించబడతాయని భక్తులు నమ్ముతారు.

అలాగే వంశ పారం పర్యంగా వచ్చే శాపాలు కూడా తొలిగిపోతాయని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

రుక్మిణీ దేవి ఒంటరిగా ఏకాంతంగా.!

కాగా, ప్రధాన ద్వారకాధీశుని ఆలయానికి 2 నుంచి 3 కిమీ దూరంలో వున్న ఈ రుక్మిణీ దేవి ప్రశాంతతకు మారు పేరు.

చాలా నిశ్శబ్ధంగా అమ్మవారు ఏకాంతంగా అంతర్మధనంతో కనిపిస్తూనే ప్రశాంతంగా భక్తులకు దర్శనమిస్తుంది.

అలాగే, గర్భ గుడిలోని రుక్మిణీ దేవి ఆకారం, చతుర్భుజాలతో ప్రత్యేకంగా దర్శనమిస్తుంది.

నాలుగు చేతుల్లోనూ శంఖం, చక్రం, పద్మం, గద వుంటాయ్. అంటే సాక్ష్యాత్తూ విష్ణు స్వరూపిణిగా పరాశక్తిగా అమ్మవారిని కొలుస్తారు.

ద్వారక యాత్రకు వచ్చిన భక్తులు మొదటగా ప్రధాన ఆలయంలోని ద్వారకాధీశుని దర్శిించుకున్నాకే రుక్మిణీ దేవిని దర్శించుకోవాలి.

ఈ రెండు ఆలయాల దర్శనం అనంతరమే యాత్ర పరిపూర్ణమైనట్లుగా చెబుతారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group