Home » ఏఐ తార.! లేడీ సూపర్ స్టార్ నయనతార ‘గుట్టు’ విప్పేశారిలా.!

ఏఐ తార.! లేడీ సూపర్ స్టార్ నయనతార ‘గుట్టు’ విప్పేశారిలా.!

by Mudra369 Editorial Desk
0 comments
Nayanthara

Nayanthara Beach AI Beauty.. ఓ వైపు, ‘చుట్టమల్లే..’ సాంగ్‌లో జాన్వీ కపూర్‌ని జుగుప్సాకరంగా ‘ఏఐ డీప్ ఫేక్’ మార్ఫింగ్ ద్వారా చిత్రీకరించడంపై వివాదం నడుస్తోంది.

ఇంతలోనే, నయనతార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వివాదాస్పదమవుతున్నాయి కూడా.! తన సోషల్ మీడియా వేదికగా నయనతార కొన్ని పొటోల్ని షేర్ చేసింది.

మామూలుగా నయనతార ఏ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినా, క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయ్. నయనతారకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.

ఇక్కడ.. ఫొటోలో కుడి, ఎడమ వైపు.. కనిపిస్తున్నాయి కదా.. అవి ఒరిజినల్ ఫొటోలు.! మధ్యలో వున్నది మాత్రం, ఏఐ టూల్ ద్వారా క్రియేట్ చేసింది.

Nayanthara
Nayanthara

ఎవరు చేశారోగానీ.. అనుకోవడానికి వీల్లేదిప్పుడు.! ఎందుకంటే, అందరికీ ఏఐ టూల్స్ అందుబాటులోనే వున్నాయి. అక్కడిదాకా ఎందుకు, ‘ఎక్స్’లోనే గ్రూక్ అందుబాటులో వుంది.

ఏదన్నా ఫొటో కనిపిస్తే, దాన్ని మనకెలా కావాలో అలా మార్చి ఇవ్వమని అడిగితే, క్షణం ఆలోచించకుండా మార్చేసి ఇచ్చేస్తోంది గ్రోక్.!

Nayanthara Beach AI Beauty.. ఏఐ టూల్స్.. ఆపలేం..

ఇంతలా ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేస్తే, ఎవరు మాత్రం ఆగుతారు.? అస్సలు ఆగరు.!

సెలబ్రిటీలు కన్నర్రజేసి.. వ్యవహారం పోలీసుల దాకా వెళితే, ‘నాకేం తెల్సు.? సోషల్ మీడియాలో దొరికింది..’ అనేస్తారేమో.

సరే, ఆ భయాల సంగతి పక్కన పెడితే, ‘నయనతార భలే వుంది కదా.. వయసు మీద పడుతున్నా వన్నె తరగని అందం నయనతార సొంతం..’ అంటూ కొందరు ‘కవితలు’ అల్లేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.

ఎవరి గోల వారిది మరి.! ఏమాటకామాటే, అసలంటూ ఈ రచ్చకి ఆస్కారం లేకుండా నయనతారే, సరైన ఫొటోలు పోస్ట్ చేసి వుండొచ్చు కదా.?

ఏమో, ఇప్పుడు నయనతార కూడా గుస్సా అయి, ‘ఏఐ టూల్స్ వాడి, తన ఫొటోల్ని అసభ్యకరంగా సర్క్యులేట్ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అని హెచ్చరిక జారీ చేస్తోనో.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group