Home » హాటెస్ట్ ‘కిల్లర్’.! చూసి చెప్పండి, కోటి కొట్టెయ్యండి.!

హాటెస్ట్ ‘కిల్లర్’.! చూసి చెప్పండి, కోటి కొట్టెయ్యండి.!

by Mudra369 Editorial Desk
0 comments
Jyoti Poorvaj Killer

Jyoti Poorvaj Killer Crore.. సరదాగా అన్నాడేమో.! విషయం సీరియస్ అయిపోయిందేమో.! అయితేనేం, మాట మీద నిలబడ్డాడు.!

దర్శక నిర్మాత పూర్వజ్, తన సతీమణి జ్యోతి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించాడు. సినిమా పేరేమో ‘కిల్లర్’.!

సినిమా చాలా హాట్ అండ్ వైల్డ్‌గా తెరకెక్కింది. ‘మీ భర్తే దర్శక నిర్మాత కదా.. ఆయన ముందర, హాట్ సీన్స్ ఎలా చేశారు.?’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, నటన అనేది జస్ట్ ప్రొఫెషన్ అతే.. అని తేల్చేసిందామె.

అంతే కాదు, ‘అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఫీలింగ్స్ ఏమీ రావు. సో, నో ప్రాబ్లెమ్. అప్పుడు కేవలం నేను నటిని మాత్రమే..’ అని జ్యోతి చెప్పుకొచ్చింది.

Jyoti Poorvaj Killer Crore.. ట్విస్ట్ ఊహిస్తే.. కోటి.!

బుల్లితెరపై ముదురు పాత్రలో కనిపించి, వెండితెరపై హాట్ అండ్ వైల్డ్ పాత్రలో కనిపించబోతోంది జ్యోతి పూర్వజ్.!

ఇక, ‘కిల్లర్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో, ‘సినిమాలోని ఓ ట్విస్ట్ వుంటుంది.. ఆ ట్విస్ట్‌ని ఊహిస్తే, కోటి రూపాయలు ఇస్తా..’ అని ప్రకటించేశాడు పూర్వజ్.

Jyoti Poorvaj Killer
Jyoti Poorvaj Killer

అంతే, ఈ వ్యవహారం ట్రోలింగ్‌కి గురయ్యింది. విషయం సీరియస్ అయ్యేసరికి, ‘నిజంగానే ఇస్తా..’ అంటూ, కొన్ని కండిషన్స్ రాసుకొచ్చాడు, తదుపరి ప్రమోషనల్ ఈవెంట్‌కి.

న్యాయవాది ద్వారా, చట్టబద్ధంగా చెబుతున్నా.. అంటూ, సదరు కండిషన్స్‌ని మీడియా ముందుంచాడు దర్శక నిర్మాత పూర్వజ్. ఈ సినిమాలో ఆయన కూడా నటించాడు లెండి.

కేవలం ఐదు నిమిషాలే సమయం..

ఇంటర్వెల్ తర్వాత, సరిగ్గా ఐదు నిమిషాలే సమయమట. ఆ ఐదు నిమిషాల సమయంలోనే, ఆ ట్విస్ట్ గురించి చెప్పేయాలట. వాట్సాప్ ద్వారా వివరాలు పంపించాలట.

ఏ థియేటర్లో సినిమా చూస్తున్నారన్న విషయాన్ని టిక్కెట్ రూపంలో తెలియజేయాలట. ఇవన్నీ చేస్తే, కరెక్ట్‌గా గెస్ చేసినవాళ్ళకి కోటి రూపాయల బహుమతి ఇస్తాడట. ఇదీ సంగతి.

‘ఆ కోటి రూపాయలైనా ఈ సినిమాకి వస్తాయా.?’ అంటూ సోషల్ మీడియాలో పడిన సెటైర్ నేపథ్యంలో, ఇంత సీరియస్ స్టెప్ తీసుకున్నాడు పూర్వజ్.

ఇస్తాడా.? ట్రోల్ అవుతాడా.?

సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టుకోకుండా ఎవడెవడో ఏదేదో వాగుతుంటాడు.. అంటూ, నెటిజన్లని చాలా తక్కువగా చేసి మాట్లాడిన పూర్వజ్, ఇప్పుడు ఈ కోటితో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా కూడా మారిపోయాడు.

Jyoti Poorvaj Killer
Jyoti Poorvaj Killer

సినిమా తేడా కొట్టిందంటే, ఆ తర్వాత ట్రోలింగ్ వేరేలా వుంటుంది మరి.!

అన్నట్టు, ఆ కోటి నిజంగానే ఇచ్చినా, సొంత మనుషులకే ఇచ్చుకునే అవకాశం ఎక్కువ.! ఇలాంటి జిమ్మిక్స్ ఎన్ని చూడలేదు.? అన్నది నెటిజనం ఉవాచ.

చివరగా.. ఈ ‘కోటి’ ఆఫర్.. కేవలం ప్రీమియర్స్‌కి మాత్రమే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group