Pawan Jagan Rebel Danger.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! 151 సీట్లను 2019 ఎన్నికల్లో గెలిచి, అధికార పీఠమెక్కిన వైఎస్ జగన్, 11 సీట్లకు పడిపోయారు.!
2019 రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్2024 ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో సంచలనం సృష్టించారు.
స్థానిక ఎన్నికల విషయానికొస్తే, వైసీపీ తాను అధికారంలో వున్నప్పుడు రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జన సేన పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వైసీపీ సింగిల్‌గా పోటీ చేసింది.. కూటమిలో జనసేన పార్టీ విజయాల్ని అందుకుంటోంది.! ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.
Pawan Jagan Rebel Danger.. పులివెందులలో ఇలా.. పిఠాపురంలో అలా..
పులివెందులలో వైసీపీ చేతులెత్తేసింది మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో. పిఠాపురంలో జన సేన పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.!
గెలుపుని గెలుపుగానే చూడాలి.! ఓటమిని ఓటమిగానే చూడాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. గెలిచాక, మరింత బాధ్యతగా వ్యవహరించారు.
అంతిమంగా, రాజకీయమంటే ప్రజా సేవ మాత్రమే.! అయితే, జనసేనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ విశ్లేషణపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పులివెందులలో వైసీపీ ఓడినా, అది నైతిక విజయమని వైసీపీ అను‘కుల’ మీడియా అంటోంది.! అదే, పిఠాపురంలో జనసేన గెలిచినా, ‘రెబల్ – డేంజర్’ అంటూ చిత్ర విచిత్రమైన విశ్లేషణలు చేస్తోంది.
జనసేన రెబల్స్.. ఆ లెక్క వేరు..
పిఠాపురంలో రెబల్స్ ఎవరు.? కూటమి సర్దుబాట్లలో భాగంగా సీట్లు దక్కనివారు. ఈ తరహా రెబల్స్ వల్ల ఆయా పార్టీలకు వచ్చిన నష్టమేమీ వుండదు.
స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలిచినా, అధికార పార్టీ వైపు వెళుతుంటారు సాధారణంగా. ఎందుకంటే, ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి కాబట్టి.
ఆ కారణంగానే, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలకు అడ్వాంటేజ్ వుంటుంది. ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి ఘనవిజయాన్ని అందుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మిగతా పార్టీల్లో రెబల్స్ వేరు.. జనసేన పార్టీలో రెబల్స్ వేరు.! అధిష్టానం తమకు సీట్లు కేటాయించడంతో అలకబూని, రెబల్స్‌గా మారారంతే.
గెలిచి, ఆ విజయాన్ని జనసేనానికే అంకితం చేస్తున్నారు రెబల్స్. మరిక్కడ, ‘డేంజర్’ ఏం కనిపించింది.? ఎందుకంటే, అదో నీలి కామెర్ల విశ్లేషణ కాబట్టి.
స్థానిక ఎన్నికల్లో జరిగిన గొడవల విషయానికొస్తే, వైసీపీ హయాంలో ఇంకా దారుణాలు జరిగాయ్. అలాగని, ఇప్పటి గొడవల్ని సమర్థించడం సబబు కాదు.!