Home » ‘రామాయణ’ ఫస్ట్ రివ్యూ.! వీఎఫ్ఎక్స్ అదుర్స్.!

‘రామాయణ’ ఫస్ట్ రివ్యూ.! వీఎఫ్ఎక్స్ అదుర్స్.!

by Mudra369 Editorial Desk
0 comments
Ramayana First Review

Ramayana First Review.. ‘రామాయణ’ సినిమా విడుదలకు ముందు తీవ్రమైన విమర్శల్నే ఎదుర్కొంది. విమర్శల్ని మాత్రమే కాదు, అత్యంత జుగుప్సాకరమైన ట్రోలింగ్‌నీ ఎదుర్కొంది ‘రామాయణ’ టీమ్.!

ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి, టీజర్ అలానే ట్రైలర్, చివరికి పాటలు కూడా ట్రోలింగ్‌ని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఏ ఒక్కదానికీ పాజిటివ్ అప్లాజ్ వచ్చిందే లేదు.

రణ్‌బీర్ కపూర్ రాముడిగా అస్సలు బాలేడనీ, సాయి పల్లవి అస్సలు సీతమ్మ పాత్రలో కుదరలేదనీ.. ఇలా బోల్డన్ని అభిప్రాయాలు, సినిమాకి వ్యతిరేకంగా వచ్చాయ్.

రావణుడి పాత్రలో యష్‌కి మాత్రం మంచి అప్లాజ్ మొదటి నుంచీ వస్తోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్రలో రకుల్ బావుందనే పాజిటివిటీ కూడా చూశాం.

Ramayana First Review.. వీఎఫ్ఎక్స్ గురించే…

ఎట్టకేలకు, సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ టాక్ ఏంటంటే, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా వున్నాయని. యష్ చాలా బాగా చేశాడనీ, శూర్ఫణక పాత్రలో చక్కగా రకుల్ ఒదిగిపోయిందని.

షరామామూలుగానే, రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ బాలేడన్న టాక్ కొనసాగుతూనే వుంది. సాయి పల్లవి మీద కూడా సినిమా రిలీయ్యాకా.. అదే నెగెటివిటీ వినిపిస్తోంది.

ఎమోషన్స్ సరిగ్గా పండలేదనీ, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బీభత్సంగా వున్నాయనీ అంటున్నారు. వీఎఫ్ఎక్స్ సినిమాని వేరే లెవల్‌లో నిలబెట్టిందన్నది చూసినవారంతా చెబుతున్నమాట.

నార్త్‌లో ఈ సినిమాకి గుడ్ టాక్ వినిపిస్తోంది. సౌత్‌లో ఒకింత నెగెటివ్ టాక్ కనిపిస్తోంది. కర్నాటకలో మాత్రం, యష్ కారణంగా ‘రామాయణ’కి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ విడుదలయ్యాక చూస్తున్నాం.

టెక్నికల్లీ బిగ్ సౌండ్..

కథ అందరికీ తెలిసిందే. కథనం ఎలా దర్శకుడు నడిపించాడన్నదే కీలకం ఇక్కడ. పూర్తిగా వీఎఫ్ఎక్స్‌ని నమ్ముకుని ‘రామాయణ’ టీమ్, పని చేసిందన్న అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయ్.

సినిమాటోగ్రఫీ చాలా బావుందనీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూాడా సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళేలా వుందనీ చూసినవారంటున్నారు.

త్రీడీ ఎఫెక్ట్స్ బాగా వర్కవుట్ అయ్యాయట. బిగ్ స్క్రీన్ మీద.. అంటే, డాల్బీ స్క్రీన్ల మీద సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అత్యద్భుతమని వీక్షకులు చెబుతున్నారు.

సినిమా రివ్యూ కాస్సేపట్లో..

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group