Home » శివానీ నాగారం.. ఒంపు సొంపుల వయ్యారం.!

శివానీ నాగారం.. ఒంపు సొంపుల వయ్యారం.!

by Mudra369 Editorial Desk
0 comments
Shivani Nagaram

Shivani Nagaram Bold Beautiful.. చెంపకు చేరెడె కళ్లు, చక్కని చెక్కిళ్లు.. నవ్వితే నవరత్నాలు రాలే చిరునవ్వు.. ఇలా తెలుగందాన్ని ఏమని వర్ణించగలం.!

ఈ వర్ణనలకు చక్కటి నిదర్శనంగా వుంటుంది ఈ తెలుగమ్మాయ్.

పేరు శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలో నటించింది. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సుహాస్‌కి సరసన నేచురల్ బ్యూటీగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శివానీ నాగారం. అసలు సిసలు తెలుగమ్మాయ్. పక్కా హైద్రాబాదీ. డిగ్రీ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

తొలి సినిమాకే కంటెంట్ వెయిట్ వున్న పాత్రను దక్కించుకుంది. అంతేకాదు, తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. తొలి సినిమానే అయినా ఎలాంటి బెరుకూ లేకుండా నటనలో మెచ్చూరిటీ ప్రదర్శించింది.

Shivani Nagaram Bold Beautiful.. తెలుగమ్మాయా.! మజాకానా.!

తెలుగమ్మాయిలు సొంత గూట్లో అదేనండీ.! తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. తొలి సినిమాకే హిట్టు కొట్టింది. కానీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేదు శివానీ నాగారం.

అలా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఓకే చేసేయడం లేదు. అవకాశాల కోసం తన డిగ్నిటీని చేజార్చుకోనంటోందీ అందాల భరిణ శివాని నాగారం.

Shivani Nagaram
Shivani Nagaram

అన్నట్లు సెకండ్ ఛాన్స్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా. ఈ సినిమాకి ఏ స్థాయిలో ప్రశంసలు దక్కాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలా తొలి సినిమా, మలి సినిమా రెండు సూపర్ హిట్స్ శివానీ నాగారం ఖాతాలో వున్నాయ్.

తొలి సినిమా హీరో సుహాస్‌తోనే మరో సినిమాకీ సైన్ చేసింది శివానీ. ఆ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. లేట్ అయినా సరే, లేటెస్ట్ కథల్ని.. అదేనండీ కంటెంట్ వున్న కథల్నే ఎంచుకుంటానంటోంది.

గ్లామర్‌కి దూరమా.?

తెలుగమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త హద్దులు పెట్టుకుంటారన్న వాదన ఒకప్పటిది.

ఇప్పుడు ఆ వాదనకు చెల్లు చీటీ పాడేశారు. గ్లామర్‌లో నార్త్ భామలకు తామేం తీసిపోమని ప్రూవ్ చేశారు ఇప్పటికే చాలా మంది తెలుగమ్మాయిలు.

అదే దోవలో ఈ పదహారణాల తెలుగందం శివానీ నాగారం కూడా చేరిపోయింది. తాజాగా గ్లామర్ అవుట్ ఫిట్‌లో శివానీ నాగారం చేయించుకున్న ఫోటో షూట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.

ఎంత కంటెంట్ వున్న సినిమాలు చేస్తే మాత్రం.. గ్లామర్ దారి గ్లామర్‌దే కదా.! బ్లాక్ అండ్ సిల్వర్ కాంబో అవుట్ ఫిట్‌లో శివానీ హాట్ అండ్ హాటెస్ట్ పోజులు కేక పుట్టిస్తన్నాయ్.

Shivani Nagaram
Shivani Nagaram

రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్‌లో స్ట్రాప్ డిజైన్ ఫుల్ బీడ్స్ వర్క్ బ్లౌజ్ ధరించింది. దీనికి కాంబోగా వేసిన ప్లెయిన్ బ్లాక్ కలర్ గగ్రా చోళీ టోటల్ కాంబినేషన్‌ని ఒకదానినొకటి ఎలివేట్ చేసుకుంటున్నాయ్.

యాక్సెసరీస్ విషయానికి వస్తే, ఒక చేతికి నిండుగా మెటల్ డిజైన్ బ్యాంగిల్ సెట్ ధరించింది. అదే ప్యాటర్న్‌లో చెవులకు ధరించిన మీడియమ్ సైజ్ ఇయర్ రింగ్స్.. శివానీ నాగారం ముఖానికి బ్రైట్ ఎట్రాక్షన్ తెచ్చాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group