Revanth KTR Land Scam.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం పన్నారు.. మాజీ మంత్రి కేటీయార్ అనూహ్యంగా ఇరుక్కుపోయారు.!
ప్రస్తుత బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్‌గా వున్నప్పుడు.. అంటే, కేసీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే.
కక్ష సాధింపు చర్యలకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దిగాలనుకుంటే, గడచిన రెండున్నరేళ్ళలో కేసీయార్ ఎప్పుడైనా అరెస్టయి వుండేవారేమో.
మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ మీద తాజాగా రేవంత్ రెడ్డి, ‘భూ కబ్జా ఆరోపణలు’ చేశారు. అది కూడా, అసెంబ్లీ వేదికగా. విచారణకు ఆదేశించారు అసెంబ్లీ సమావేశాల నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.
ప్రస్తుతానికైతే ఈ విషయమై ఇప్పటిదాకా కేసీయార్ నుంచి ఎలాంటి అధికారిక ఖండన ప్రకటనా రాలేదు. కానీ, కేటీయార్ సహా హరీష్ రావు తదితరులంతా ఉలిక్కిపడ్డారు.
Revanth KTR Land Scam.. కేటీయార్ ఎందుకింతలా ఉలిక్కిపడుతున్నట్లు.?
మరీ ముఖ్యంగా కేటీయార్, కిందా మీదా పడుతున్నారు.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేక. రాజకీయ విమర్శలైతే ఇరు పక్షాల నుంచీ జోరుగా నడుస్తున్నాయ్.
కానీ, కేటీయార్ వైపు నుంచి ఖండన ప్రకటన, అంత సమర్థవంతంగా కనిపించడంలేదు. పైగా, ‘హైద్రాబాద్‌లో తామంతా కలిసి వుండటానికి, సరైన ఇల్లు లేక, వేర్వేరుగా వుంటున్నాం..’ అంటూ ఓ చిత్రమైన వాదనను కేటీయార్ తెరపైకి తెచ్చారు.

కేసీయార్ అంటే ఎవరు.? కేటీయార్ అంటే ఎవరు.? వారి వారి ఆస్తులేంటి.? వారి వారి సంపాదనలేంటి.? బీఆర్ఎస్‌గా మారిన ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీకి ఏ స్థాయిలో నిథులున్నాయి.? ఇవన్నీ అందరీకి తెలిసిన విషయాలే.
అక్కడ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ వేరు. ఇక్కడ కేటీయార్ ఇస్తున్న వివరణ వేరు. తండ్రి కేసీయార్, తనయుడు కేటీయార్.. కలిసి ఒకే చోట వుండాలనుకుంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతుంది కదా.?
డబుల్ బెడ్రూమ్ ఏం ఖర్మ.. ఓ ఖరీదైన బంగ్లానే సొంతం చేసుకోగలరు కేసీయార్ అయినా, కేటీయార్ అయినా.? ఇద్దరికీ విడివిడిగా హైద్రాబాద్‌లోనే ఇళ్ళున్నాయ్.
పైగా, ‘మా తాతల ద్వారా వందల వేల ఎకరాల ఆస్తులు వారసత్వంగా వచ్చాయ్..’ అని గతంలో కేటీయార్ చెప్పారు.. కేసీయార్ కూడా చెప్పారు.
అదే సమయంలో, తమకు పెద్దగా ఆస్తులు లేవనీ, చాలా తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే వుందని కేటీయార్ చెప్పిన వీడియోలు కూడా అందుబాటులోనే వున్నాయి.
సాధారణ సర్పంచ్ కోట్లకు పడగలెత్తుతున్న రోజులివి. అలాంటిది మంత్రిగా పని చేసిన కేటీయార్, ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీయార్, తండ్రీ కొడుకులుగా ఉమ్మడి కుటుంబం కలిసి వుండటానికి సరైన ఇల్లు లేకపోవడమంటే, కామెడీ కాకపోతే మరేంటి.?
ఇదే తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి, భూ కబ్జా ఆరోపణల్ని కేసీయార్ మీద చేస్తే, కేటీయార్ ఇలా ఇరుక్కుపోవడం.. గులాబీ పార్టీ శ్రేణులకే మింగుడు పడ్డంలేదు.
