Home » ముద్రాభిప్రాయమ్: పరివర్తన లేదు.? రాజనీతి అసలే లేదు.!?

ముద్రాభిప్రాయమ్: పరివర్తన లేదు.? రాజనీతి అసలే లేదు.!?

by Mudra369 Editorial Desk
0 comments
Parivartan Rajniti Party Vijaya Sai Reddy

Parivartan Rajniti Party Vijayasai Reddy.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి కొత్త రాజకీయ పార్టీ దూసుకొచ్చింది.! ఆ పార్టీ పేరు పీఆర్పీ.! అదేనండీ పిఆర్‌పి.!

అదేంటీ, అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి కదా, పీఆర్పీ అనే రాజకీయ పార్టీని స్థాపించింది. ఔను, చిరంజీవి పార్టీ కూడా పీఆర్పీనే.!

కాకపోతే, ఆ పీఆర్పీ వేరు.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పీఆర్పీ వేరు.! అది ప్రజా రాజ్యం పార్టీ. ఇది, పరివర్తన్ రాజ్‌నీతి పార్టీ.!

కాదు కాదు, పరివర్తన రాజనీతి పార్టీ.! ఇంగ్లీషులో ఒకలా తగలడింది, తెలుగులో ఇంకోలా తగలడింది పేరు.!

దటీజ్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.. అని కాంగ్రెస్ నేత షర్మిల చెప్పినట్లుగా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు.

Parivartan Rajniti Party Vijayasai Reddy.. విజయసాయి రెడ్డి ‘పరివర్తన’ ఇంతేనా.?

తెలుసు కదా, ఈ పార్టీని ఎవరు స్థాపించారో.? ఇంకెవరు, మాజీ రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి.! అదేంటీ, ఆయన వైసీపీ కదా.!

ఒకప్పుడు వైసీపీ నేత మాత్రమే కాదు, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు కూడా అయిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు కొత్త రాజకీయ కుంపటి పెట్టారు ‘పీఆర్పీ’ పేరుతో.!

ఆ రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపించానని విజయ సాయి రెడ్డి చెబుతున్నారట.!

అన్నట్టు, డెబ్భయ్ సార్లు వైసీపీలో అవమానాలు ఎదురయ్యాక గానీ, వైసీపీని వీడాలనే ఆలోచన రాలేదు విజయ సాయి రెడ్డికి.

డెబ్బయ్ అవమానాలు..

అలా డెబ్బయ్ సార్లు అవమానాలకు గురి కావడం వల్ల, వైసీపీ అనేది ఓ కుటుంబ పార్టీ అని తెలిసినట్లుంది.! మొత్తమ్మీద, విజయ సాయి రెడ్డి కొత్త పార్టీ పెట్టేశారు.

ఇంతకీ, విజయ సాయి రెడ్డిలో ‘పరివర్తన’ వచ్చిందా.? ప్చ్, రాలేదు.! పరివర్తన అనేది వచ్చి వుంటే, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ‘అప్రూవర్’గా మారి వుండేవారే.!

ఇక, రాజనీతి అనేది ఏమన్నా విజయ సాయి రెడ్డికి వుందా.? అంటే, అదే వుంటే.. ఆయన అన్నేళ్ళు వైసీపీలో ఎలా వుంటారు.?

పరివర్తన, రాజనీతి.. ఈ రెండూ లేవు గనక, అవి లేకపోవడమే తాను ‘పరివర్తన రాజకీయ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు అర్హుడినని బహుశా విజయ సాయి రెడ్డి అనుకున్నారేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group