Shilpa Manjunath Born Meaning.. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతోంది.! ఓ నటి, ఓ రచయిత గురించి మాట్లాడుతూ, ‘బోర్న్ రైటర్’ అని పేర్కొంది.!
అక్కడే, అదే వేదిక మీదున్న సినీ ప్రముఖుడు పక్కనే వున్న మరో ప్రముఖ నటితో ముసి ముసి నవ్వులు నవ్వుతూ గుసగుసలాడాడు.!
ఆ పక్కనే వున్న ఇంకో సినీ ప్రముఖుడూ, ఈ గుసగుసల్లో భాగమయ్యాడు.! ఇంతలోనే, ‘బోర్న్ రైట్’ అని కామెంట్ చేసిన నటి, వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.
‘బోర్న్ అంటే, బీ-వో-ఆర్-ఎన్ మాత్రమే..’ అంటూ సదరు నటి స్పష్టతనిచ్చేసరికి, అంతా ఫక్కన నవ్వుకున్నారు.! వివరణ ఇచ్చాక.. విషయం మరింత వివాదాస్పదమయ్యింది. వివాదాస్పద రీతిలో వివరణ వుంది మరి.!
Shilpa Manjunath Born Meaning.. బోర్న్ రైటర్.. అందులో తప్పేముంది.?
విషయం అర్థమయ్యింది కదా.! ఆమె స్పష్టంగానే ‘బోర్న్ రైటర్’ అనే చెప్పింది. కానీ, అది ఇంకోలా అర్థమయ్యింది, ఆ వేదిక మీదున్న సినీ ప్రముఖుడికి.!
అంటే, ఇక్కడ విషయం.. ఆలోచణా ధోరణి గురించి. ఎంత వక్ర కోణంలో సదరు సినీ ప్రముఖుడు ఆలోచించాడో కదా.!
‘బోర్న్ రైటర్’ అని వ్యాఖ్యానించిన నటి పేరు శిల్పా మంజునాథ్.! సదరు సినీ ప్రముఖుడి పేరు మిస్కిన్.! ఆ పక్కనే కూర్చున్న ప్రముఖ నటి ఎవరో కాదు, కీర్తి సురేష్.!

ఎంత దారుణమైన సందర్భమిది.? మామూలుగా అయితే, ఇలాంటి ఈవెంట్లలో సెలబ్రిటీలు మాట్లాడే మాటల్ని, నెటిజన్లు ట్రోల్ చేయడానికి, వక్ర భాష్యాలు చెప్తారు.
కానీ, ఇక్కడ.. ఎవరో తమని కష్టపడి కంటెంట్ వెతుక్కుని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ట్రోల్ చేయడానికి అవసరమైన కంటెంట్ ఇస్తాం.. అన్నట్లుంది మిస్కిన్ వ్యవహారశైలి.
కీర్తి సురేష్ బలైపోతోంది..
మరోపక్క, ఈ మధ్య ఇలాంటి సందర్భాల్లో అనవసరంగా ఇరుక్కుపోతోంది కీర్తి సురేష్.! మొన్నామధ్య ‘అక్క’ ప్రమోషన్స్ నేపథ్యంలో, రాధిక ఆప్టే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కీర్తి సురేష్ బలైపోయింది.
దక్షిణాదిలో, అందునా తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో.. మావయ్యని పెళ్ళి చేసుకుంటుంది అమ్మాయి.. ఇదేం పద్ధతి.? అంటూ రాధిక మండిపడింది.
సీనియర్ నటుడితో రొమాన్స్ విషయమై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది రాధిక. ఆ వ్యాఖ్యల్ని ఖండించలేక నానా తంటాలూ పడింది కీర్తి సురేష్.
ఇక్కడ, ఈ ‘బోర్న్ రైటర్’ డబుల్ మీనింగ్ వ్యవహారంలో నేరుగా కీర్తి సురేష్‌కి సంబంధం లేకపోయినా, మిస్కిన్ ‘రాంగ్ మీనింగ్’ తీసి, చర్చించింది కీర్తి సురేష్‌తోనే.