Home » ఇన్‌సైడ్ స్టోరీ: తరుణ్ భాస్కర్‌ని చిన్నచూపు చూసిందెవరు.?

ఇన్‌సైడ్ స్టోరీ: తరుణ్ భాస్కర్‌ని చిన్నచూపు చూసిందెవరు.?

by Mudra369 Editorial Desk
0 comments
Tharun Bhascker

Tharun Bhascker ENE Repeat.. ఈ నగరానికి ఏమైంది’ చాన్నాళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇది.! దానికి సీక్వెల్ ఈ మధ్యనే వచ్చింది.

దర్శకుడు తరుణ్ భాస్కర్ అనగానే, ముందుగా గుర్తుకొచ్చేది ‘పెళ్ళి చూపుల’ సినిమా.!

అప్పటికీ, ఇప్పటికీ చాలా మారింది. తరుణ్ భాస్కర్ అంటే, ఇప్పుడు మంచి నటుడు కూడా.! నటుడిగా పలు సినిమాల్లో నటించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు.

‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా విడుదలైంది.. బాగానే టాక్ సంపాదించుకుంది.. సినిమాకి సక్సెస్ మీట్లు కూడా పెడుతూనే వున్నారు.

పెద్ద సినిమాలకైనా, చిన్న సినిమాలకైనా ఈ మధ్య ట్రోలింగ్ సర్వసాధారణం. వెబ్ సైట్లలో వచ్చే న్యూస్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోవ వచ్చే కవరేజ్.. ఇవన్నీ మామూలే.

కొన్ని నెగెటివ్ కథనాలొస్తాయ్.. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరగడం కూడా ఈ మధ్య సినిమాలకి సర్వసాధారణం.

అలానే, ‘ఈఎన్ఈ రిపీట్’కి కూడా జరిగింది. ఎక్కడ హర్టయ్యాడోగానీ, ‘ఇకపై చూపిస్తా నేనేంటో.. నన్ను తక్కువ అంచనా వేయడం జరుగుతోంది.. మారుస్తా.. అన్నీ, మారుస్తా..’ అంటూ తరుణ్ భాస్కర్ ఎమోసనల్ అయ్యాడు తాజాగా.

ఎంతకీ, తరుణ్ భాస్కర్‌ని ఎవరు తక్కువగా చూశారు.? అయినా, తరుణ్ భాస్కర్‌ని తక్కువ చేయడానికి ఏముంది.? మంచి దర్శకుడు, మంచి నటుడు కూడా.!

కథ తీసుకుని వెళితే, పెద్ద హీరోలే ‘ఓకే’ చెప్తారు తరుణ్ భాస్కర్‌కి. పెద్ద పెద్ద నిర్మాతలూ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తారు.

అవన్నీ అవసరం లేదు, తన కథ.. తానే దర్శకత్వం చేసుకుని, ప్రేక్షకుల ముందుకి సినిమాని తీసుకురాగల సత్తా వుంది తరుణ్ భాస్కర్‌కి.

అయినాగానీ, ఎవరికో ఏదో నిరూపించాలని గట్టిగా అనుకుంటున్నాడంటే, ఎవరో చాలా గట్టిగానే హర్ట్ చేసి వుండాలి.? ఎవరు.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఒక్కటి మాత్రం నిజం.! హర్ట్ అయి వుంటే, అవమానాల్ని ఎదుర్కొని వుంటే.. చేతల్లో తానేంటో నిరూపించుకోవాల్సిన సమయమిది.

తరుణ్ భాస్కర్ లాంటి టాలెంటెడ్ నటుడు, దర్శకుడు.. స్టేజ్ మీద మాట్లాడాల్సిన మాటలు కావివి. చేతల్లో సమాధానం చాలా గట్టిగా చెప్పాల్సిందే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group