Table of Contents
Aadarsha Kutumbam OTT Trolling.. బిగ్ స్క్రీన్ మీద సినిమా ఎక్స్‌పీరియన్స్‌కి ఏదీ సాటి రాదు.!
ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన, ఎంత పెద్ద టీవీ అయినాసరే. అది బుల్లితెర మాత్రమే.!
అందుకే, బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్.. అని పదే పదే మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడంటే 70 ఎంఎం స్క్రీన్లు సర్వసాధారణమైపోయాయ్.! ఒకప్పుడు, చిన్న స్క్రీన్లు వుండేవి.
పిక్చర్ క్వాలిటీ విషయంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న థియేటర్ల గురించి తెలుసు కదా.! వాటికి, ప్రేక్షకుల ఆదరణ కూడా బావుంటోంది.
మల్టీప్లెక్సుల్లో సినిమాలకి ఓ రకమైన ‘కిక్కు’ దొరికితే, సకల సౌకర్యాలూ వున్న మోడ్రన్ సింగిల్ థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే కిక్కు వేరే లెవల్ అంతే.!
Aadarsha Kutumbam OTT Trolling.. క్వాలిటీ ఏమైపోతోంది.?
అంతా బానే వుందిగానీ, థియేటర్లలో పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా సినిమాల్లో క్వాలిటీ వుంటోందా.? ఇదీ ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
‘అవతార్’ లాంటి సినిమాల్ని బిగ్ స్క్రీన్ మీదనే చూడాలి. వీలైతే, త్రీడీలోనే చూడాలి. ఒరిజినల్ డాల్బీ థియేటర్ అయితేనే బెస్ట్.!
అదంతా, పక్కన పెట్టేద్దాం.. వస్తున్న సినిమాలెలా వున్నాయ్.! ప్చ్, ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాయి. ప్రేక్షకుల ఆలోచనలు కూడా మారిపోయాయ్ మరి.!
టిక్కెట్ ధరకీ, లభిస్తున్న ఎంటర్టైన్మెంట్‌కీ సమతూకం కోసం ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు. తూకం సరిపోవట్లేదు, సినిమాలకి ప్రేక్షకులు దూరమైపోతున్నారు.
ఇంట్లోనే దర్జాగా..
ఓ నెల రోజులు ఆగితే, ఇంట్లోనే సినిమాని దర్జాగా కుటుంబమంతా ఉచితంగా చూసెయ్యచ్చనుకుంటున్నారు. థియేటర్ క్వాలిటీ పిక్చర్, థియేటర్ క్వాలిటీ సౌండ్ వుంటున్నాయ్ మరి టీవీల్లో.
ఇలా, ఇంట్లో సినిమా చూశాక.. ఆ సినిమాకి సగటు ప్రేక్షకుడు ఇస్తున్న రివ్యూలు చూస్తోంటే, మతిపోతోందంతే. వీటిని సోషల్ మీడియాలో అదుపు చేయలేం కదా.! భావ ప్రకటనా స్వేచ్ఛనే ఇది.
హిట్టు సినిమాలూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నాయి ఓటీటీలోకి వచ్చాక. ఫ్లాప్ సినిమాల సంగతి సరే సరి.!
థియేటర్లలో రిలీజ్ అయ్యాక జరిగే ట్రోలింగ్ ఓ యెత్తు.. ఓటీటీలో వచ్చాక, జరిగే ట్రోలింగ్ ఇంకో యెత్తు. ఇది వేరే లెవల్ అంతే.
ఓటీటీ ట్రోలింగ్.. ఇది వేరే లెవల్.!
‘ఆదర్శ కుటుంబం’ సినిమాకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.!
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇదే సినిమా తీస్తే, సూపర్ డూపర్ హిట్టు. త్రివిక్రమ్ సినిమా కదా.. ‘గురూజీ’ అన్న గుర్తింపూ ఆయనకి వుంది కదా.. ఎక్కువ ఆశిస్తారు మరి.! అందుకే, ఏకిపారేస్తున్నారు.
ఇంట్లో వంద కోట్ల రూపాయల కరెన్సీని దాచడమేంటి.? లాటరీ తగిలిందని, అతన్ని నమ్మి కోట్ల రూపాయల అతని మీద ఖర్చు చేయడమేంటి.? ఇలా చాలానే ప్రశ్నలు మళ్ళీ వస్తున్నాయ్.
నివేదా పేతురాజ్‌కి అసలు కథలో స్థానమెందుకొచ్చింది.? పోలీస్ వ్యవస్థ మరీ అంత అచేతనంగా ఎందుకు మారిపోయింది.? అబ్బో, బోల్డు ప్రశ్నలు.
జస్ట్ ఎంటర్టైన్మెంట్.. అన్న కోణంలో, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాని తీసుకోలేకపోతున్నారు. అంత గొప్పగా హాస్యమూ పండలేదు మరి.!
వెతికి చూస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైలాగ్ ఒక్కటీ లేదు. అంటే, ఆయన పెన్నులో ‘పవర్’ తగ్గినట్లే కదా.? ఏ సీన్ కూడా త్రివిక్రమ్ మార్క్ ‘స్పెషల్’ లేకపోవడమంటే, దర్శకత్వ ప్రతిభా చూపలేకపోయినట్టే కదా.?
మారాల్సిందే…
వెరసి, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకి ఓటీటీలో రిలీజ్ అయ్యాక వస్తున్న సమీక్షలు, సినిమాని మరింతగా ట్రోల్ చేసేలా వున్నాయ్.!
త్రివిక్రమ్ ఎందుకు, అసలు వెంకటేష్ ఎందుకు.? ఇంతోటి సినిమాకి.. అన్న చర్చ జరుగుతోంది మళ్ళీ. ఇది ‘గురూజీ’ త్రివిక్రమ్ తీసిన సినిమానే కాదసలు.! ఇదీ ఆయన అభిమానుల ఆవేదన.
ఏదైతేనేం, నెగెటివ్‌గానే అయినా, ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది కదా.. అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఔను, సినిమా రివ్యూలయందు.. ఓటీటీ రివ్యూలు వేరయా.! ఇదొక స్వీట్ వార్నింగ్.!
త్రివిక్రమ్ లాంటి కొందరు దర్శకులు, తమ కోసమే సినిమాలు చూసే అభిమానుల కోసం, ఆత్మ విమర్శ చేసుకోవడం తప్పనిసరి.