Table of Contents
Taapsee Pannu… ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. అంటే ఇదేనేమో. విషయమేంటనుకుంటున్నారా.? అందాల భామ.. సారీ, అందంగా ఉండనంటోన్న భామ తాప్సీ గ్లామర్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ తాప్సీ. అఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా అనుకోండి.
అయితే, బాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. అడపా దడపా సౌత్ సినిమాలూ చేస్తోంది. ఇక నటనతో పాటు, అప్పుడప్పుడూ ఆడియన్స్ అటెన్షన్‌ని చెక్ చేసేందుకు కొన్ని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది తాప్సీ.
Taapsee Pannu.. నిజంగానే అందాల రాక్షసి
అందులో భాగంగానే తాజాగా తన అందం గురించి తానే కొన్ని కామెంట్లు చేసుకుంది. వావ్.. ఇంట్రెస్టింగ్ కదా. తాప్సీ అస్సలు అందంగానే ఉండదట. చెంపకు చారెడు కళ్లు కానే కావట తనవి. కొటేరేసిన ముక్కు అంటారు కదా.. అలాంటి అందమైన ముక్కు తనకు లేదంటోంది.

లక్క పిడతలాంటి పెదవులు తనవి కావట. ఇక జుట్టు విషయానికి వస్తే, రింగు రింగులు తిరిగి గంగిర్లు పుట్టించేలా ఉంటుందట.. వామ్మో ఇదంతా తాప్సీ స్వయంగా చెప్పుకున్న వర్ణనేనండీ బాబూ.. మనకేం సంబంధం లేదు.
తాప్సీ మాటలకు ఇన్ని అర్ధాలా.?
ఇక, అప్పుడెప్పుడో సౌత్ దర్శకులు తనను గ్లామర్ డాళ్‌గా మాత్రమే చూశారంటూ.. తన బొడ్డుపై పూలూ, పండ్లే కాదు, కొబ్బరి చిప్పలు కూడా పగలగొట్టేశారంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అందుకే సౌత్‌లో తాను సినిమాలు చేయనని కూడా చెప్పుకొచ్చింది. కానీ, ఆ వెంటనే మాట తప్పేసింది. ఆ తర్వాత కొన్నిసౌత్ సినిమాల్లోనూ నటించింది తాప్సీ.
అలాగే, ఎక్స్‌పోజింగ్ విషయంలోనూ ఒకానొక టైమ్‌లో షాకింగ్ కామెంట్లు చేసింది అందాల తాప్సీ. అంతేకాదు, గ్లామర్ రోల్స్‌లో కనిపించనని కూడా చెప్పింది. మళ్లీ ఆ వెంటనే ఓ బాలీవుడ్ సినిమా కోసం విచ్చలవిడి గ్లామర్ షో చేసింది. బికినీలో కనిపించి రచ్చ రచ్చ చేసింది. ఇలా ఒక్కసారి కాదు.. చాలా సార్లే తాప్సీ మాటలు మార్చేసింది. ఇప్పుడేమో తానేం పెద్ద అందగత్తెను కాదంటోంది. రేపో మాపో తనకన్నా పెద్ద అందగత్తె లేదంటూ షాకచ్చినా ఇచ్చేస్తుంది.
ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే..
బాలీవుడ్‌కి వెళ్లాకా బక్క చిక్కిపోయి, జీరో సైజ్‌కి మారిపోయిన తాప్సీ అసలు అందం అంటే అంగాంగ ప్రదర్శనా కాదు, చెక్కిన శిల్పంలా కనిపించడమూ కాదు. ఎలా ఉన్నా అందమే అంటూ తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Also Read: Niharika Konidela అందుకే సినిమాలు మానేసిందా.?
ఎలా ఉన్నా సరే, ఎవరి శరీరాన్ని వారు ఇష్టపడడం అలవాటు చేసుకోవాలనీ, అదే అసలు సిసలు అందం అనీ కొత్త ఫిలాసఫీకి తెర లేపింది. వావ్.! వాట్ ఏ ఫిలాసీఫీ కదా. అందుకే, తాప్సీ (Taapsee Pannu) మాటలకు అర్ధాలే వేరు మరి. అంతేగా.. అంతేగా.
			        
														