Shruti Haasan Single Parent.. పిల్లల్ని కనాలంటే, పెళ్ళి చేసుకోవాలి.! అబ్బే, అదంతా అవసరం లేదు.! పెళ్ళి చేసుకోకుండానే పిల్లల్ని కనొచ్చు.!
మొన్నీమధ్యనే ఓ సినిమాలో చూశాం కదా.! పైగా, అది హిట్టు సినిమా.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో హీరో సూర్య, పెళ్ళి చేసుకోకుండానే ఓ బిడ్డకు తండ్రవుతాడు.. సరోగసీ విధానంలో. బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ స్ఫూర్తిగా ఈ పాత్రని దర్శకుడు రాసుకుని వుంటాడు.
పలువురు సెలబ్రిటీలు, అందునా సింగిల్ పేరెంట్స్.. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కన్నారు. కనడం అనడం సబబు కాదుగానీ, ‘తెచ్చుకున్నారు లేదా కొనుక్కున్నారు’ అంటే సబబేమో.
ఈ లిస్టులోకే హీరోయిన్ శృతి హాసన్ కూడా చేరిపోతుందా.? శృతి హాసన్ మాటల్ని వింటోంటే, ఆల్రెడీ ఆ దిశగా ఆమె తనదైన ప్రయత్నాల్ని ఇప్టటికే ప్రారంభించి వుండాలి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ, ‘తల్లినవ్వాలనుకుంటున్నాను.. అదీ, పెళ్ళితో సంబంధం లేకుండా..’ అంటూ చెప్పుకొచ్చింది.
ఎలా.? అన్నదానిపై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది. దత్తత తీసుకోవాలనేది శృతి హాసన్ ఆలోచన అట. అమ్మాయిని దత్తత తీసుకుంటుందో.. అబ్బాయిని దత్తత తీసుకుంటుందో మరి.!
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలుసు కదా.? ఆమె కూడా అంతే, పెళ్లి చేసుకోలేదు. కానీ, ఇద్దరు పిల్లలకు తల్లి. ఇద్దర్నీ దత్తత తీసుకుంది సుస్మితా సేన్.
మరో నటి సన్నీ లియోన్ కూడా ఓ అమ్మాయిని తొలుత దత్తత తీసుకుంది. ఆ తర్వాత, సరోగసీ విధానంలో ఇద్దరు అబ్బాయిలకు తల్లి అయ్యింది.
గత కొంతకాలంగా ఈ సరోగసీ ట్రెండ్ చాలా ఎక్కువయిపోతోంది. సాధారణ పౌర సమాజంలో కూడా సింగిల్ పేరెంట్ అనే మాట ఎక్కువగా వింటున్నాం.
సరోగసీ, టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఇలా రకరకాల మార్గాల్లో తల్లిదండ్రులవుతున్నారు చాలామంది. కొందరు జంటలుగా, కొందరు సింగిల్ పేరెంట్స్‌గా.!
ఇంతకీ, పెళ్ళి మీద శృతి హాసన్‌కి ఎందుకంత విరక్తి వచ్చినట్లు.? గతంలో మైఖేల్ కోర్సలేతో కొన్నాళ్ళు సహజీవనం చేసింది శృతి హాసన్. అది బ్రేకప్ అయ్యింది.
ఆ తర్వాత శాంతను హజారికా అనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక్కడా బ్రేకప్ తప్పలేదు శృతి హాసన్‌కి.
