Deviyani Sharma Stylish Saitaan.. స్టైలింగ్‌లో తనదైన ముద్ర వేస్తూ.. ఇండో – వెస్ట్రన్ ఫ్యూజన్‌గా నిలవడంలో నటి దేవియాని శర్మ ఎప్పుడూ ట్రెండింగలోనే వుంటుంది.
ఇండో – వెస్ట్రన్ ఫ్రాక్స్ దేవియాని శర్మ డ్రస్సింగ్ స్టైల్‌లో ప్రముఖంగా చూస్తుంటాం.
లేటెస్ట్‌గా ఆ తరహాలో అవుట్ ఫిట్‌లోనే మెరుపు తీగలా ముస్తాబై సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది దేవియాని శర్మ. ఫ్యాషన్ ప్రియుల్ని ఈ ఫోటో పోజులు క్రేజీగా ఎట్రాక్ట్ చేస్తున్నాయ్.
రాయల్ మెరూన్, డార్క్ వైన్, క్రిమ్సన్ రెడ్ మరియు క్లాసిక్ బ్లాక్ వంటి బోల్డ్ కలర్స్‌ని హ్యాండిల్ చేయడంలో దేవియాని శర్మ ఆల్వేస్ పర్‌ఫక్ట్.
Deviyani Sharma Stylish Saitaan.. యూనిక్ ఫ్యాషన్ ఐకాన్
డార్క్ వైన్ కలర్ నెట్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ హెవీ సీక్వెన్స్ వర్క్ వున్న అవుట్ ఫిట్‌లో దేవియాని రాయల్ క్వీన్‌లా మెరిసిపోతోంది . హై పోనీ టెయిల్ ఈ డ్రస్‌కి మరింత డిగ్నిటీ తీసుకొచ్చింది.
ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.. ఎలాంటి కలర్ దుస్తులు ధరించినా తన లుక్స్ అండ్ అప్పియరెన్స్‌లో ఎప్పుడూ కాన్ఫిడెన్స్ కనిపించేలా జాగ్రత్త పడడం దేవియాని శర్మ స్పెషాలిటీ.
ఈ తాజా అవుట్ ఫిట్‌కి మ్యాచింగ్ అయ్యేలా దేవియాని చేయించుకున్న డార్క్ ఐ షాడో ఆమె కళ్లను మరింత హైలైట్ చేస్తూ ఎక్స్‌ప్రెసివ్ లుక్స్ తెచ్చిపెట్టింది.

ఆమె చేతులపై వుండే టాటూస్ ఆమె మోడ్రన్ అండ్ బోల్డ్ పర్సనాలిటీకి అద్దం పడుతూ ప్రతీ అవుట్ ఫిట్‌కి ఒక యూనిక్ ఎడ్జ్ ఇస్తాయ్.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అడపా దడపా కొన్ని సినిమాలూ అలాగే, వెబ్ కంటెంట్‌తో బిజీగా వుంది.
ఆమె నటించిన ‘సైతాన్’ క్రైమ్ థ్రిల్లర్ డిఫరెంట్ గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే కామెడీ జోనర్‌లో ‘సేవ్ ది టైగర్స్’ దేవియాని శర్మలోని నటిని డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేసింది.