Laddu Prasadam Ghee Adulteration.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కల్తీ నెయ్యితో చేసిన లడ్డూల్ని వైసీపీ హయాంలో ‘టీటీడీ’ అందించింది.!
చిన్న కరెక్షన్.! లడ్డూ కాదు, లడ్డూ ప్రసాదం.! ఔను, లడ్డూ అంటే మార్కెట్లో దొరికే లడ్డూ కాదు, అది శ్రీవారి ప్రసాదం.!
మామూలుగా ప్రసాదం అంటే, తొలుత దాన్ని నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తాం. ఆ తర్వాత, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం.
అబ్బే, అదేం కాదు.. వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యం వేరు, భక్తులకు విక్రయిస్తున్న ప్రసాదం వేరు.. అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు.
గత కొన్నాళ్ళుగా ఈ ‘కల్తీ’ విషయమై పెద్దయెత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. సీబీఐ రంగంలోకి దిగింది, ఈడీ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది.
Laddu Prasadam Ghee Adulteration.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం..
ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు.. తాజాగా, మరో వ్యాపారి అరెస్టయ్యాడు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా అరెస్టుపై ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అయితే, ఆ ప్రెస్ నోట్‌లో ‘జంతువుల కొవ్వు’ ప్రస్తావన లేకపోవడంతో, అసలంటూ కల్తీనే జరగేదన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింతైన ప్రచారానికి తెరలేపింది.
కల్తీ జరిగింది.. అని ఈడీ ప్రెస్ నోట్ స్పష్టంగా చెబుతోంది. ఎలా కల్తీ చేశారన్నదానిపైనా చూచాయిగా ఓ వివరణ ఇచ్చింది. కల్తీకి వాడిన పదార్థాల గురించీ పేర్కొంది.
అయితే, జంతువుల కొవ్వు.. అనే అంశాన్ని పర్టిక్యులర్‌గా పేర్కొనలేదు. జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టి, అంతా ఓకేనా.? భక్తుల మనోభావాలు దెబ్బ తినలేదా.? ఇదీ, ఇప్పుడు వైసీపీ దుష్ప్రచారం తర్వాత తెరపైకొస్తున్న ప్రశ్న.
స్వచ్ఛమైన నేతిని లడ్డూ ప్రసాదానికి వినియోగించాలి. కానీ, స్వచ్ఛమైన నెయ్యి రూపంలో, నెయ్యిలా వుండే కల్తీ పదార్థాన్ని వినియోగించారని ఈడీ స్పష్టం చేసింది.
సో, కల్తీ జరిగింది.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి శిక్ష పడాలి చట్ట పరంగా.
లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందంటే, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి వున్న అంశం మాత్రమే కాదు, ఆ భక్తుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కూడా.
230 కోట్ల రూపాయల కుంభకోణంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తేల్చిన దరిమిలా, దీన్ని ఆషామాషీ విషయంగా వైసీపీ పరిగణిస్తే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వివిధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా, మద్దతుదారులైన సెలబ్రిటీల ద్వారా ‘కల్తీ జరగలేదు’ అని వైసీపీ చెప్పించాలనుకోవడం దుర్మార్గం.
దేవుడంటే భక్తి మాత్రమే కాదు, భయం కూడా వుండాలి.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయమై, ఇంత నీఛ రాజకీయం.. అత్యంత జుగుప్సాకరం.!
