Home » స్వర్గీయ ఎన్టీయార్‌ని ‘కొరియన్ కనకరాజు’ అవమానించాడా.?

స్వర్గీయ ఎన్టీయార్‌ని ‘కొరియన్ కనకరాజు’ అవమానించాడా.?

by hellomudra
0 comments
Korean Kanakaraju NTR Varun Tej

Korean Kanakaraju Vs NTR.. స్వర్గీయ నందమూరి తారక రామారావు.! విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. అని అభిమానులు పిలుచుకుంటుంటారు.!

సినీ, రాజకీయ రంగాల్లో తిరుగులేని పేరు ప్రఖ్యాతుల్ని స్వర్గీయ ఎన్టీయార్ సంపాదించుకున్నారు.

జీవితంలో అత్యున్నత శిఖరాల్ని అందుకోవడమే కాదు, జీవిత చరమాంకంలో అదఃపాతాళాన్ని కూడా చూశాాయన.

చివరి రోజుల్లో అయినవాళ్ళే అవమానించారు.. కన్న బిడ్డలు పూట తిండి కూడా పెట్టలేదు.. అంటూ, స్వర్గీయ ఎన్టీయార్ గురించి ఆయన అభిమానులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తంటారు.

సరే, గతం గతః తెలుగు నేలపై, తిరుగులేని సినీ ప్రముఖుడు, రాజకీయ ప్రముఖుడిగా.. స్వర్గీయ ఎన్టీయార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

అంతటి మహానుభావుడిని గత కొంతకాలంగా పదే పదే అవమానిస్తూ వస్తున్నారు కొందరు. అవమానించడం అంటే, ఆయన పేరుని దుర్వినియోగం చేయడం.

Korean Kanakaraju Vs NTR.. అమెచ్యూరిష్ స్ట్రోక్..

‘కొరియన్ కనకరాజు’ సినిమాలో కమెడియన్ సత్య, ఓ సన్నివేశంలో ‘అమెచ్యూరిస్ స్ట్రోక్’ అంటాడు. అది కూడా, స్వర్గీయ ఎన్టీయార్‌ని అనుకరిస్తూ.

నిజానికి, ఇలాంటి అనుకరణలు తెలుగు సినిమాల్లో సర్వసాధారణం. వేల సార్లు స్వర్గీయ ఎన్టీయార్‌ని అనుకరిస్తూ ఎందరో నటీనటులు, హాస్యభరిత సన్నివేశాల్లో నటించారు.

కానీ, కమెడియన్ సత్య ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో చేసిన కామెడీని పట్టుకుని, స్వర్గీయ ఎన్టీయార్ మీద లేనిపోని ప్రేమ కురిపిస్తూ, వివాదాల్ని తెరపైకి తెస్తున్నారు.

అసలిందులో ఎన్టీయార్‌ని అవమానించిందేముంది.? అని చాలామంది అంటోంటే, లేదు అవమానించారు.. అంటూ, స్వర్గీయ ఎన్టీయార్‌ని అవమానిస్తున్నరు అభిమానుల ముసుగులో కొందరు.

ఎవరో రెచ్చగొడితే, ఇంకెవరో రెచ్చిపోయి, కుల రాజకీయాల్ని కూడా తెరపైకి తెచ్చేస్తున్నారు. అనుకరణ అనేది కూడా ఓ కళ. ట్రోలింగ్ అనేది మళ్ళీ వేరే చర్చ.

ఓ అనుకరణని ఆస్వాదించడం మానేసి, అవమానించారంటూ, ట్రోలింగ్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం మూర్ఖత్వం. అది, స్వర్గీయ ఎన్టీయార్‌ని అవమానించినట్లే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group