Home » నభా నటేష్ ‘సెల్ఫ్’ లవ్.! ఆత్మవిశ్వాసమే అసలు సిసలు అందమ్.!

నభా నటేష్ ‘సెల్ఫ్’ లవ్.! ఆత్మవిశ్వాసమే అసలు సిసలు అందమ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Nabha Natesh

Nabha Natesh Self Love.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చాలా మంది అందాల భామలు ముద్దు ముద్దుగా చెబుతుంటారు.

అందంగా వుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు కూడా. అందుకు అనుగుణంగానే తమ శారీరక సౌందర్యంపై దృష్టి పెడుతుంటారు.

కానీ, అసలు సిసలు అందం ఆత్మ విశ్వాసంలోనే వుందంటారు ఇంకొందరు. సెల్ఫ్ కాన్పిడెంట్‌గా వుంటే చాలు శరీరం ఎలా వున్నా.. అందంగానే కనిపిస్తామని నమ్ముతుంటారు.

ఇంతకీ ఇప్పుడెందుకీ ‘అందం – ఆత్మ విశ్వాసం’ టాపిక్ అంటాారా.! సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపించడానికి చాలా కష్టపడుతుంటారు.

తమ శరీరంలో చిన్నా చితకా లోపాలున్నట్లయితే వాటిని మేకప్‌తో కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

కానీ, నభా నటేష్ తన జీివితంలో అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్ తాలూకు గాయాన్ని కవర్ చేయకుండానే తనలోని అందాన్ని కాన్ఫిడెంట్‌గా ప్రొజెక్ట్ చేస్తోంది ఈ ఫోటో షూట్‌లో.

Nabha Natesh Self Love.. గాయాలు మిగిల్చిన గాట్లు.!

అందుకే నభా నటేష్ ఈ ఫోటో పోజులు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయ్ సోషల్ మీడియాలో.

కొన్నాళ్ల క్రితం నభా నటేష్ ఓ యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భుజానికి మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్‌లోనే వుండాల్సి వచ్చింది.

దాంతో, ఆమె కెరీర్ కూడా ఖతమైపోయిందనుకున్నారంతా. కానీ, పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చింది నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

సర్జరీ గాయాలు మానినా అవి మిగిల్చిన మచ్చలు మాత్రం ఏళ్ల తరబడి శరీరంపై అలాగే వుండిపోతుంటాయ్.

అలాగే నభా నటేష్ భుజంపైన సర్జరీ తాలూకు గాటు అలాగే వుండిపోయింది.

ఏమాత్రం సంకోచం లేకుండా, ఎంతో గర్వంగా, ఆత్మ విశ్వాసంతో గాయానికి సంబంధించిన గుర్తును దాచకుండానే తన ఫోటో షూట్‌లో ప్రదర్శించింది నభా నటేష్.

‘బాడీ పాజిటివిటీ’కి మరియు సెల్ఫ్ లవ్‌కీ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే నభా నటేష్ ఈ ఫోటోల గురించి ప్రత్యేకమైన ప్రస్థావన జరుగుతోంది సోషల్ మీడియాలో.

బోల్డ్ అండ్ హాట్ బట్ పక్కా కాన్ఫిడెంట్.!

ఈ ఫోటోల్లో నభా నటేష్ బీచ్ లుక్‌లో మెరిసిపోతూ కనిపిస్తోంది. బ్రౌన్ కలర్ హాల్టర్ నెక్ బికినీ టాప్ ధరించింది ఈ ఫోటోస్‌లో నభా నటేష్.

ఫ్రంట్ భాగంలో నాట్ డిజైన్ వున్న ఈ టాప్‌కి బోటమ్‌లో డార్క్ బ్రౌన్ లేస్ ప్యాటర్న్ లెగ్గిన్ వేసింది.

ఒక రిసార్ట్ బ్యాక్ డ్రాప్‌లో నభా నటేష్ ఈ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోస్‌లో ఆమె ఎడమ భుజంపై వున్న సర్జికల్ గాయం తాలూకు గుర్తు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.

ఇదే ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి నిదర్శనంగా ప్రస్థావించుకోవచ్చు.

Nabha Natesh
Nabha Natesh

అందుకే నభా నటేష్ ఈ ఫోటోలు అంత ప్రత్యేకంగా నెట్టింట వైరల్ అవుతున్నాయ్. ప్రస్తుతం ఆమె కెరీర్ కూడా జోరుగానే నడుస్తోంది.

ఇటీవలే ‘నాగ బంధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా ‘స్వయంభు’ అనే పీరియాడికల్ మూవీలో నభా నటేష్ ఓ సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించబోతోంది.

అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘టైసన్ నాయుడు’ సినిమాలోనూ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group