Home » ముఖ్యమంత్రి పదవి నా ‘ప్రాధాన్యతాంశం’ కాదు: నారా లోకేష్

ముఖ్యమంత్రి పదవి నా ‘ప్రాధాన్యతాంశం’ కాదు: నారా లోకేష్

by Mudra369 Editorial Desk
0 comments
Nara Lokesh

Lokesh Slams CM Rumors.. తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని నారా చంద్రబాబు నాయుడు తర్వాత చేపట్టబోయేది ఎవరు.? ఇంకెవరు, నారా లోకేష్.! ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.!

మరి, టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ పేరు ఎందుకు ప్రస్తావనకి రాకూడదు.? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.!

ఇంతకీ, ముఖ్యమంత్రి పదవి విషయమై నారా లోకేష్ మనసులో ఏముంది.? టీడీపీ కార్యకర్తలేమో డిప్యూటీ సీఎం నారా లోకేష్.. అంటూ, సోషల్ మీడియా వేదికగా హడావిడి చేస్తుంటారు.!

అంతేనా, ‘చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది నారా లోకేష్ మాత్రమే..’ అని తెగేసి చెబుతుంటారు.!

‘చంద్రబాబు గారూ.. మీకు వయసైపోయింది, నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిగా చెయ్యండి’ అని కూడా డిమాండ్ చేస్తుంటారు.

అక్కడితోనూ ఆగరు.. ‘సీఎం లోకేష్..’ అంటూ నినదిస్తుంటారు టీడీపీ కార్యకర్తలు.! ‘మీరు గోల చేసి, ఇప్పుడున్న ఉద్యోగాన్ని (మంత్రి పదవిని) పోగొట్టేలా వున్నారు’ అని ఓ సందర్భంలో అభిమానులకు లోకేష్ షాకిచ్చారు కూడా.

Lokesh Slams CM Rumors.. లోకేష్ మనసులో మాట ఇదీ..

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో.. అదీ, నేషనల్ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు నారా లోకేష్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.. అదీ, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి.

‘ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదా.?’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘నా ప్రాధాన్యత అది (ముఖ్యమంత్రి పదవి) కాదు..’ అని తేల్చేశారు నారా లోకేష్.

‘ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మంచి మార్పులు తీసుకురావడమే నా ప్రధాన కర్తవ్యం. ఆ దిశగానే పని చేస్తున్నాను. ప్రజల మన్ననలు అందుకుంటాను..’ అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

నిజానికి, చాలా హుందాగా బదులిచ్చారు నారా లోకేష్, ‘ముఖ్యమంత్రి పదవి’ విషయమై ఎదురైన ప్రశ్నకి.! ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది.

కూటమి ఐక్య నిర్ణయం..

కూటమిలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జన సేన, బీజేపీ కలిసి, కూర్చుని సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబునాయుడిని నిలబెట్టడం.

టీడీపీకి మెజార్టీ సీట్లు వచ్చినా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం టీడీపీకి వున్నా, నారా చంద్రబాబునాయుడు.. కూటమి ధర్మానికి కట్టుబడే వున్నారు.

చంద్రబాబే అంత ఖచ్చితంగా కూటమి ధర్మానికి కట్టుబడి వున్నప్పుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎందుకు, కూటమికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు.?

ఏమో, సమీప భవిష్యత్తులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయేమో.! పార్టీ కార్యకర్తల నుంచి ‘సీఎం లోకేష్’ అనే డిమాండ్లు ఇంకా పెరిగి, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆయనకు దక్కేలా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group