Ruhani Sharma Stylish Glamour.. సినిమాల్లో అవకాశాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో మాత్రం రుహానీ శర్మ ట్రెండింగ్ అవుతూ వుంటుంది.
కారణం అందరికీ తెలిసిందే.. ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫొటోలే. తెలుగు తెరకు ‘చిలసౌ’ సినిమాతో పరిచయమైంది రుహానీ శర్మ.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి, నటిగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది రుహానీ. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా రుహానీ శర్మకి సినిమాల్లో ఛాన్సులు వస్తుంటాయ్.

స్టార్ హీరోయిన్ అయ్యేంత స్టామినా వున్నా, ఎందుకో ఆ స్థాయిని అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. అయితేనేం, ఇదిగో ఇలా ఫొటోలతో తరచూ వార్తల్లోకెక్కుతుంటుందీ భామ.
తాజాగా, రుహానీ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయ్. స్టైలిష్ లుక్‌లో రుహానీ శర్మ, తనదైన ఆటిట్యూడ్‌ని మిక్స్ చేసి ఫొటోలకు పోజులిచ్చింది.

తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాల్లో రుహానీ శర్మ నటించింది. బుల్లితెరపైనా సందడి చేసింది.
బోల్డన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి, రుహానీ శర్మ పాపులారిటీని సంపాదించుకుంది. ‘హిట్ – ఫస్ట్ కేస్’ తదితర సినిమాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి తెలుగులో.
