Vijay Deverakonda Ranabaali Negativity.. విజయ్ దేవరకొండ చుట్టూ ఎప్పుడూ ఓ రకమైన నెగెటివిటీ వైఫైలా తిరుగుతుంటుందేమో.!
ఆ మాటకొస్తే, ఏ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా, ఆ సినిమా చుట్టూ ఓ రేంజ్ నెగెటివిటీ ముందుగానే పుట్టుకొస్తుండడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
ఆ హీరో, ఈ హీరో.. అన్న తేడాల్లేవ్.! మొన్నటికి మొన్న నాని సినిమా మీదా ఇదే తరహా నెగెటివిటీ చూశాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్, మహేష్.. అందరిదీ ఇదే పరిస్థితి.
అయితే, విజయ్ దేవరకొండ మీద నెగెటివిటీ ఇంకో స్థాయిలో వుంటుంది. దానిక్కారణం, విజయ్ దేవరకొండ ‘రౌడీ’యిజం అనుకోవాలా.? అంటే, అది కూడా ఓ కారణమే.. అని చెప్పక తప్పదు.
Vijay Deverakonda Ranabaali Negativity.. విజయ్ దేవరకొండ చేసిన తప్పేంటి.?
వాస్తవానికి విజయ్ దేవరకొండ, అందరు హీరోలతోనూ బాగానే వుంటాడు. సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తుంటాడు. అయినాగానీ, విజయ్ మీద నెగెటివిటీ అస్సలు తగ్గదు.
తాజాగా, ‘రణబాలి’ సినిమా మీద అప్పుడే నెగెటివిటీ వేరే స్థాయికి వెళ్ళిపోయింది. ఇదే విషయమై విజయ్ దేవరకొండ, ‘రణబాలి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా స్పందించాడు.
డబ్బులిచ్చి మరీ తన మీద నెగెటివిటీ కొందరు సృష్టిస్తున్నారని విజయ్ దేవరకొండ అన్నాడు.
డబ్బులు ఖర్చు చేసి, మనుషుల్ని పెట్టి నెగెటివిటీ సృష్టిస్తున్నారు.. ముందు ముందు ఏఐ ద్వారా ఇదే పని చేస్తారని విజయ్ చెప్పుకొచ్చాడు.
తగ్గేదే లే..
ఎవరో నెగెటివిటీ చేస్తారని తాను తగ్గేది లేదనీ, తన పద్ధతి మార్చుకునే అవకాశమే లేదని విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చేశాడు.
అంతా బాగానే వుందిగానీ.. గత కొన్నాళ్ళుగా విజయ్ దేవరకొండ సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. వరుస ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడు విజయ్.
మరి, ‘రణబాలి’ పరిస్థితేంటి.? విజయ్, రష్మిక పెళ్ళయ్యాక.. ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘రణబాలి’, ఎమోషనల్‌గా కూడా ఈ ఇద్దరికీ చాలా చాలా స్పెషల్.
ఏదిఏమైనా.. మొత్తంగా సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకొచ్చి, హీరోలంతా ఒక్కతాటిపైకి వచ్చి, సినిమాలపైనా తమపైనా వస్తున్న నెగెటివిటీకి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది.