Diamond Rani Roja.. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. కొన్ని విమర్శలు హద్దులు దాటుతుంటాయ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పదే పదే ‘ప్యాకేజీ స్టార్’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడం మామూలే.!
ఆయా విమర్శలకు గతంలోనే ‘చెప్పు’ చూపించారు జనసేన అధినేత. మాట్లాడుతూ, తన కాలికి వున్న చెప్పు తీసి చూపించి, చెప్పుతో కొడతా.. అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అన్నది పాత మాట. ఆ చెప్పు దెబ్బకి కూడా కుక్కలు లొంగని రోజులివి. సరే, ఆ సంగతి పక్కన పెడదాం.
Diamond Rani Roja.. డైమండ్ రాణి..
అసలు ఈ డైమండ్ రాణి ఎవరు.? ఏంటి కథ.! సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే.. అలాగే మంత్రి కూడా అయిన ఆర్కే రోజా గురించి పవన్ కళ్యాణ్ ‘డైమండ్ రాణి’ అనే విమర్శలు చేశారు.

తప్పేముంది.. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అన్నప్పుడు, ఆయన కూడా ఏదో ఒకటి అంటారు కదా.! తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అని ఊరకనే అన్లేదు.!
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అన్నది పాత మాట. ఆ చెప్పు దెబ్బకి కూడా కుక్కలు లొంగని రోజులివి.
Mudra369
ఇంతకీ, ఈ డైమండ్ రాణి అనే విమర్శ వెనుక అసలు కోణమేంటి.? మామూలుగా అయితే, పేకాట సందర్భంగా ‘డైమండ్, ఆటీను’ అనే ప్రస్తావనలు వస్తుంటాయి.
కింగ్, జోకర్, క్వీన్.. ఇలాంటి పేర్లు మామూలే. డైమండ్ రాణి అంటే, ఎక్కడో తేడా కొడుతోంది.
సస్పెన్స్ ఎందుకు.?
ఆ డైమండ్ రాణి సంగతేంటో పవన్ కళ్యాణ్ చెప్పకపోతే కష్టం.! అయినా, మంత్రిని పట్టుకుని అలా ఎలా అనేశావ్ పవన్ కళ్యాణ్.?
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
ఇప్పుడామె ‘నేను మహిళను.. సంస్కారం లేకుండా నన్ను తిట్టారు..’ అనంటే, రోజాకి పవన్ ఏం సమాధానం చెప్పుకోవాలి.?
ఫాఫం.. పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టేసినట్లున్నారు. ఇంతకీ ‘డైమండ్ రాణి’ అంటే ఏంటి.? అది పవన్ కళ్యాణ్‌కి మాత్రమే తెలిసిన సీక్రెట్. అంతేనా.?