Raghava Lawrence Politics.. లారెన్స్ రాఘవేంద్ర.. లారెన్స్ రాఘవ.. పేరేదైతేనేం, అతనొక ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్.!
అంతేనా, లారెన్స్ అంటే నటుడు, దర్శకుడు కూడా.! సంగీత దర్శకత్వం అనే కళ కూడా వుంది లెండి. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా సక్సెస్‌లు కొట్టాడు లారెన్స్.
సినిమాల్లో తిరుగులేని ఫాలోయింగ్ వున్న లారెన్స్, గత కొంత కాలంగా సొంత సినిమాలకు తప్ప, వేరే సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడం లేదు.
ఇక, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే విషయమై కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు లారెన్స్ రాఘవ. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ పిలుపు మేరకు లారెన్స్, రాజకీయాల్లోకి వస్తున్నాడన్న ప్రచారం జరిగింది.
Raghava Lawrence Politics.. అసలు పిలిచిందెవరు.?
అసలు విజయ్ పిలిచారా.? అలాగని గాసిప్పులు అల్లుతున్నారా.? నిజం ఏదైతేనేం, లారెన్స్ మీద ఒత్తిడి పెరిగింది రాజకీయాలకు సంబంధించి.
మరోపక్క, తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై, బీజేపీకి గుడ్ బై చెప్పి సొంత రాజకీయ కుంపటికి తెరలేపారు. ఆ అన్నామలై, స్వయంగా లారెన్స్‌ని ఆహ్వానించారన్న ప్రచారమూ జరుగుతోంది.
విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలోికి లారెన్స్ వెళతారా.? అన్నామలై వెంట నడుస్తారా.? ఇంకేదన్నా రాజకీయ పార్టీపై లారెన్స్ ఫోకస్ పెట్టారా.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి.
తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి లారెన్స్ రాఘవ, అభిమానులకే ‘నిర్ణయాన్ని’ వదిలేశాడు. అభిమానులు ఎలా నిర్ణయిస్తే, లారెన్స్ అలా నడుచుకుంటాడట.
అభిమానులు కోరుకుంటేనే..
అభిమానులు వద్దంటే, లారెన్స్ రాఘవ రాజకీయాల్లోకి రాడు. అభిమానులు రమ్మంటే మాత్రం, రాజకీయాల్లోకి వస్తాడు లారెన్స్ రాఘవ. ఇదీ, తాజాగా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం.
సేవా కార్యక్రమాల్లో లారెన్స్ రాఘవ ఎప్పుడూ ముందుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయమంటే సేవ.. సో, ఆ సేవా రంగంలో కూడా లారెన్స్ రాణిస్తాడేమో.!
అయితే, రాజకీయాలంటే సేవ.. అన్నది పాత మాట. రాజకీయమంటే, ఇప్పుడు అది వేరే.! అయితే, లారెన్స్ లాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది.
