Shirley Setia.. చక్కనమ్మ ఏం చేసినా అందమే.! అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.. అంటాడో కవి.!
నిత్య జీవితంలో బోల్డన్ని సవాళ్ళు.! అందుకే, మానసికోల్లాసం కోసం.. విహార యాత్రలు తప్పనిసరి.! ఈ విషయంలో అందాల భామల రూటే సెపరేటు.!
తెలుగులో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో తెరంగేట్రం చేసింది అందాల భామ షిర్లే సేటియా.! నాగ శౌర్య హీరోగా నటించిన సినిమా అది.
Shirley Setia.. విహార యాత్రలో..
విహార యాత్రలో భాగంగా, స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షిర్లే సేటియా షేర్ చేసింది.
పూల్‌లో నీళ్ళు.. ఆ వెనకాల సముద్రపు అందాలు.. వాట్ ఏ సీన్ కదా.! ఆ పూల్‌లోనే నచ్చిన ఆహారం.. తేలియాడుతూ వచ్చేస్తే.. ఆ కిక్కే వేరేప్పా.!

ఇచ్చట ఇష్టమైన ఆహార పదార్థాలు అందించబడును.. అన్నట్టుంది వ్యవహారం. నచ్చిన ఆహార పదార్థాల సంగతి తర్వాత.. ముందైతే అందాల వడ్డన వేరే లెవల్.. అంటున్నారు నెటిజనం.
అందం చూడవయా.. ఆస్వాదించవయా.. అన్నట్లుంది షిర్లే సేటియా సోయగాల వడ్డింపు.! కాదంటారా.? కాదనగలమా.?