Mega Family Chiranjeevi Pawankalyan.. పక్కనే పడుకున్న భార్య మీదనే అనుమానం వున్నప్పుడు, ప్రపంచంలో ఎవరి మీదనైనా అనుమానం ఇట్టే వచ్చేస్తుంటుంది.!
పెంటలో ముంచిన చెప్పుతో కొట్టినట్టు, ఎన్నిసార్లని మూర్ఖులకి సమాధానం చెప్పగలరు ఎవరైనా సరే.!
మెగా కుటుంబంలో కుంపట్లు రాజేయడానికి మీడియా, రాజకీయ పార్టీలు చాలాకాలంగా చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.
Mega Family Chiranjeevi Pawankalyan.. విడాకులేంట్రా వెర్రి వెంగళప్పల్లారా.!
చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలట.! పవన్ కళ్యాణ్ నుంచి ఆయన సతీమణి అన్నా లెజ్‌నెవా విడాకులు తీసుకుందట.! అబ్బో, ఈ తరహా ‘పుకార్లు’ ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి.
నిద్రపోయినోడ్ని లేపొచ్చుగానీ.. నిద్ర నటిస్తున్నవాడ్ని లేపగలమా.? ఛాన్సే లేదు.! అలాగే, చెవిటోడికి అర్థమయ్యేలా చెప్పగలం. చెవిటితనం నటించేవాడికో.? సాధ్యం కాదు.!
సోకాల్డ్ వెకిలి మీడియా కూడా అంతే.! సోకాల్డ్ నీతి మాలిన రాజకీయ పార్టీలు, నాయకులు కూడా అంతే.!

కీలక పదవుల్లో వున్న వ్యక్తులు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా కూడా, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నెవా గురించి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
వారికి, పవన్ కళ్యాణ్ నేరుగా సమాధానం చెప్పరు కదా.? చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా.. ఇలాంటి ‘చెత్త’ గురించి పట్టించుకోరు.
తాజాగా, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళి వేడుకలో పవన్ కళ్యాణ్, తన సతీమణి అన్నా లెజ్‌నెవాతో కలిసి సందడి చేశారు.
అబ్బే, పవన్ కళ్యాణ్ ఆ పెళ్ళికి హాజరవలేదు. ఇటలీకి భార్యతో కలిసి వెళ్ళినా, పెళ్ళి వేడుకకి దూరంగా వున్నారంటూ వెకిలి మీడియా, వెకిలి రాజకీయం.. వెక్కిరింతలకు దిగింది.
మెగా వేడుక..
కానీ, పెళ్ళి ఫొటోల్లో మెగా కుటుంబం అంతా సందడిగా కనిపించింది. చిరంజీవి, సురేఖ అలాగే నాగబాబు ఆయన సతీమణి, అలాగే పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్‌నెవా.. వీరితోపాటు, చిరంజీవి చెల్లెళ్ళు.. వారి జీవిత భాగస్వాములు.. అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
అంతేనా, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా హీరోలందరితోనూ మెగాస్టార్ కలిసి వున్న ఫొటో కూడా బయటకు వచ్చింది.
Also Read: రామ్ గోపాల్ వర్మని తిట్టాలా? ఇలా ట్రై చేసి చూడండి.!
మెగా కుటుంబంపై నిత్యం ఏడ్చి చచ్చే సోకాల్డ్ రాజకీయ నాయకులకీ, మీడియా సంస్థలకీ, రాజకీయ పార్టీలకీ అలాగే, సోషల్ మీడియాలో పనీ పాటా లేకుండా ‘ట్రోల్’ చేసేవారికీ ఈ ఫొటోలు సరిపోతాయా.?
చివరగా.. మెగా కుటుంబంపై దుష్ప్రచారం కోసమే రోజుల తరబడి, నెలల తరబడి, ఏళ్ళ తరబడి.. లక్షలు కాదు కోట్లు ఖర్చు చేస్తుంటారు కొందరు. అదో మానసిక రోగం.!