Home » తేజస్ ‘MK1A’ ఇంకెప్పుడు.? యుద్ధ రంగంలోకి దూకేదెప్పుడు.?

తేజస్ ‘MK1A’ ఇంకెప్పుడు.? యుద్ధ రంగంలోకి దూకేదెప్పుడు.?

by Mudra369 Editorial Desk
0 comments
Tejas MK1A

Tejas Mk1A Delivery Delays.. ఎయిర్ ఫ్రేమ్స్ సిద్ధంగా వున్నాయ్.. అంటే, యుద్ధ విమానం సిద్ధంగానే వుంది. కాకపోతే, ఇంజిన్లు సరైనన్ని అందుబాటులో లేవు.

పోనీ, ఎన్ని ఇంజిన్లు వుంటే, అన్ని ఇంజిన్లతో కూడిన యుద్ధ విమానాల్ని, భారత వాయు సేనకు అందించాలి కదా.? ప్చ్, రాడార్ మరియు వెపన్స్ ఇంటిగ్రేషన్ పూర్తి స్థాయిలో జరగలేదింకా.!

దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న కథే ఇది.! కథ కాదు, వ్యధ.! తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఆలస్యం కథ ఇది.!

ప్రస్తుతానికైతే తేజస్ ఎంకె1 యుద్ధ విమాానాలు భారత వాయసేన అమ్ముల పొదిలోనే వున్నాయి. కాకపోతే, వాటితో పోల్చితే తేజస్ ఎంకె1ఎ అత్యాధునిక యుద్ధ విమానం.

యుద్ధ రంగంలో, తేజస్ మాక్1ఎ ప్రత్యేకతలు వేరు.! స్వదేశీ తయారీ యుద్ధ విమానమైన తేజస్ మాక్1 (ఎంకె1)కి మెరుగులు దిద్ది, తేజస్ మాక్1ఎ (ఎంకె1ఎ) తయారు చేశారు.

Tejas MK1A
Tejas MK1A

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతరత్రా కారణాల వల్ల ఇంజిన్ల సరఫరాలో తీవర జాప్యం జరుగుతోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి వుంటే, గత ఏడాది చివర్లోనే తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరి వుండేవి.

ఈ ఏడాది కూడా, భారత వాయు సేనకు తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానాలు అందే అవకాశాలు కనిపించడంలేదు. తాజా సమాచారాన్ని బట్టి, 2027 మొదటి క్వార్టర్‌లోనే అందుతాయేమో.!

తేజస్ ఎంకె1ఎ కంటే అత్యాధునికమైనవి, పూర్తిగా కొత్త ఎయిర్ ఫ్రేమ్, మెరుగైన ఆయుధ సంపత్తి కలిగిన తేజస్ ఎంకె2 పరిస్థితేంటి.? అంటే, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

కానీ, ఇటు తేజస్ ఎంకె1ఎ అటు తేజస్ ఎంకె2 పనులు సమాంతరంగా జరుగుతున్నాయనీ, ఎంకె1ఎ భారత వాయు సేనకు ఏ క్షణాన అయినా అందొచ్చనీ, అలానే తొలి తేజస్ ఎంకె2 కూడా త్వరలోనే మొదటి పరీక్ష (గాల్లోకి ఎగరడం) జరుపుకుంటుందనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ తయారీ యుద్ధ విమానాలపై ఆధారపడటమంటే, చాలా విషయాల్లో రాజీ పడాల్సి వుంటుంది. అదే, స్వదేశీ యుద్ధ విమానాలైతే తక్కువ ఖర్చుతో, రాజీ పడాల్సిన అవసరం లేకుండా, యుద్ధ రంగంలో అద్భుతమైన పనీతురును కనబర్చవచ్చు.

అయితే, ఈ ఆలస్యం ఇంకా ఇంకా కొనసాగడం వల్లే, భారత యుద్ధ అవసరాల్ని అందుకోలేకపోతున్నామన్నది నిర్వివాదాంశం.

విదేశీ తయారీ ఇంజిన్ల మీద ఇంకెన్నాళ్ళు ఆధారపడతాం.? స్వదేశీ తయారీ ఇంజిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.?

దశాబ్దాలుగా ముక్కీ మూలిగీ.. ముందుకు కదల లేకపోతున్న కావేరీ ఇంజిన్, భారత యుద్ధ విమానాల అవసరాల్ని ఎప్పటికి తీర్చగలుగుతుంది.? వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group